అనిరుథ్ ప్రేమలో పడ్డ.. అందాల భామలు.
యువ సంగీత సంచలనం అనిరుథ్.. మాంచి సంగీత దర్శకుడు మాత్రమే కాదు.. మాంచి ప్రేమికుడు కూడా. అందుకే ఆ ఇద్దరు ఆయన ప్రేమలో పడ్డారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు..?
యువ సంగీత సంచలనం అనిరుథ్.. తన సంగీతంతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో అందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే సంగీతంలో సంచలనం సృష్టించాడు. ముఖ్యంగా వై దిస్ కొలవరీ పాటతో దేశ వ్యాప్తంగా అనిరుథ్ పేరు మారుమ్రోగింది. సంగీత సంచలనం విషయం పక్కనపెడితే.. అనిరుథ్ లో ఉన్న మరో టాలెంట్ ఏంటంటే.. అమ్మాయిలను బాగా ప్రేమిస్తుంటాడు. అందుకనే అందాల భామలు అనురుథ్ ప్రేమలో పడుతుంటారు. పబ్బులు, పార్టీలు అంటూ తెగ సందడి చేస్తుంటారు. అలాగే వివాదాలు అవ్వడం.. వార్తల్లో నిలవడం కూడా జరిగింది.
ఇంతకీ వివాదాల గురించి చెప్పాలంటే.. అనిరుథ్.. వయసులో చాలా పెద్దది అయిన ఆండ్రియాతో ప్రేమాయణం సాగించాడు. ఏమాయ చేసాడో కానీ.. ఈ అందాల భామ అనిరుధ్ ప్రేమలో పడింది. అదో సంచలనం. ఈమె నటి మాత్రమే కాదు. సింగర్.. మ్యూజిక్ లవర్. అందుకే వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. కోలీవుడ్ లో వీరి ప్రేమ గురించే మాట్లాడుకునేవాళ్లు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. విడిపోయారు. ఆండ్రియా ఆతర్వాత అనిరుధ్, శృతిహాసన్ ప్రేమలోపడ్డట్టుగా వార్తలు వచ్చాయి.
అనిరుథ్ సంగీతం అందించిన త్రి సినిమాలో శృతిహాసన్ నటించింది. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమపుట్టింది అంటారు. ఏది ఏమైనా అనిరుథ్ మాంచి సంగీత దర్శకుడు మాత్రమే కాదు..మాంచి మాటకారి కూడా. అందుకే అమ్మాయిలను ఇట్టే ప్రేమలో పడేస్తాడు అంటుంటారు. అయితే.. మేము మ్యూజిక్ లవర్స్ కావడం వలన సంగీతం గురించి మాట్లాడుకునేవాళ్లం అంతే తప్పా మా మధ్య ప్రేమలేదని చెప్పాడు అనిరుథ్. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్లేబాయ్ అంటే.. మీ పేరు చెబుతున్నారు మీరేమంటారు అని అనిరుథ్ ని అడిగితే.. ఈ వార్తలన్నీ అవాస్తవం అంటాడు అని చెప్పాడు అనిరుథ్.
Must Read ;- మళ్లీ ప్రేమలో పడిన హీరోయిన్











