సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు, జర్నీ, గీతాంజలి వంటి చిత్రాలతో సౌత్ ఇండస్ట్రిలో మంచి పేరు తెచ్చుకున్న నటి అంజలి. తెలుగు, తమిళ భాషలలొ పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సంపాదించుకుంది.నిశబ్దం, వైఎల్ సాబ్ సినిమాల్లో మంచి పాత్రలు పోషించిన అంజలి తన సమర్ధతను నిరూపించుకుంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు.
2007లో ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది అంజలి.. అయితే అందులో ఆమెకు పేదగా గుర్తింపు రాలేదు.ఆ తర్వాత నటించిన ‘షాపింగ్‌మాల్’ సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈ బ్యూటీ చక్కటి అవకాశాలను దక్కించుకుంది.మురుగుదాస్ చిత్రీకరించిన జర్నీ, అడ్డాల శ్రీకాంత్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలు ఆ కోవలో వచ్చినవే. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అనేక సినిమాల్లో నటిస్తూ, అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న అంజలి.. ఆమె నటించిన తమిళచిత్రం ‘ఎంగేయం ఎప్పోదం’లో తన అద్భుతమైన నటనకు గాను ‘సౌత్ ఫిల్మ్‌ఫేర్-2012’, ‘విజయ్’ అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే తాజాగా అంజలి బాలకృష్ణ సినిమాలో కనిపించబోతోందనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది.ఇప్పటికే డిక్టేటర్ చిత్రంలో బాలయ్యతో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ, మరోసారి బాలయ్య చిత్రంలో మెరవబోతోందని టాక్.అయితే అది హీరోయిన్ గా కాదట..బాలయ్య మూవీలో అంజలి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించనుందనే వార్తలు సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఇప్పటికే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 107th మూవీతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం కూడా తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడు.ఇక ఈ చిత్రం తండ్రీ కూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగుతుందని ఆయన తన తాజా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు.
ఈ చిత్రంలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుందని ఆయనే చెప్పాడు. ఇక కథానాయికలుగా ప్రియమణి – మెహ్రీన్ పేర్లు వినిపించాయి. తాజాగా అంజలి పేరు తెరపైకి వచ్చింది.ఈ చిత్రంలో అంజలి ఓ కీలక పాత్ర పోషించబోతోందనే టాక్ కూడా వినిపిస్తోంది.ఇప్పటికే శంకరాభరణం చిత్రంలో నెగిటివ్ షెడ్ రోల్ చేసిన అంజలి, మంచి నటనను కనబరచిందనే పేరు తెచ్చుకుంది. దీంతో దర్శకుడు అనిల్ రావిపూడి కూడా మూవీలో అనాలి పాత్రను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట. మరి ఈ చిత్రంలో అంజలి ఎలా కనిపించనుందో అనేది మాత్రం వేచి చూడాల్సిందే.