జగన్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్ కొనుగోలు రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది. ఒప్పందంప్రకారమే పీపీఏల చెల్లింపులు జరగాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలకతీర్పు ఇచ్చింది.బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని, డిస్కమ్‌లను హైకోర్టు ఆదేశించింది. పీపీఏల నుంచి తప్పుకోవడానికి వీల్లేదన్న న్యాయస్థానం ఆర్థిక కారణాలతో ధర తగ్గింపు కోరలేరని స్పష్టం చేసింది. అదేసమయంలో ధరలు తగ్గించాలని సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది.
తాము అధికారంలోకి రాగానే సోలార్ పీపీఏ లను రద్దు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన జగన్.. సిఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే ఒక కమిటీ వేసి దాని ద్వారా పీపీఏల రద్దుకు సిఫార్సు చేయించారు.ఇక క్యాబినెట్ సైతం దానికి ఆమోదం తెలపడంతో జగన్ ప్రభుత్వం సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసింది.
దీంతో ఈ అంశంపై పౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కోర్టును ఆశ్రయించాయి.ఇక కేంద్ర ప్రభుత్వం సైతం పీపీఏ ఒప్పందాన్ని రద్దు చేయవద్దంటూ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఒకసారి చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కుదరదని , అలా చేస్తే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా రావని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే జగన్ మాత్రం తన పంతం నెగ్గాల్సిందే అనే ధోరణిలో ఈ ఒప్పందాలను రద్దు చేశారు.కాగా ఈ పరిణామం అటు డిస్కిం లకు, ఇటు రాష్ట్రానికి పెను భారంగా మారింది.
ఈ అంశంపై విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వేసిన వ్యాజ్యాలను అనుమతించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపి కీలక తీర్పును వెలువరించింది. సౌర విద్యుత్ కొనుగోలు రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది.విద్యుత్ ఉత్పత్తి మరియు వాటి పంపిణీ సంస్థల మధ్య జరిగిన వాణిజ్ఞ ఒప్పందం ప్రకారమే యూనిట్ ధరలను 25 ఏళ్ల పాటు చెల్లించి తీరాలని కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా సవరణ చేయవలసి వస్తే అది ఇరు పక్షాల సమ్మతితోనే జరగాలి తప్ప గతంలో ఏపీఈఆర్‌సీ ఉత్తర్వుల ముసుగులో ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.అన్ని పెండింగ్ బకాయిలను, చెల్లింపులను ఆరు వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని, డిస్కమ్‌లను హైకోర్టు ఆదేశించింది. ఇక ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయనే నెపంతో ప్రభుత్వం పీపీఏల నుంచి తప్పుకోవడానికి వీల్లేదన్న న్యాయస్థానం స్పష్టం చేసింది. డిస్కమ్‌ల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సోలార్ యూనిట్‌కు రూ.2.44, పవన విద్యుత్‌కు రూ.2.43 చొప్పున చెల్లించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.
ఇదిలా ఉంటే ప్రస్తుత యూనిట్ టారిఫ్ ధరలను సమీక్షించాలంటూ ఏపీఈఆర్సి , డిస్కిం లు దాఖలు చేసిన రెండు పిటిషన్ లకు విచారణ అర్హత లేదని కోర్టు కొట్టి వేసింది.ఈ అంశంపై సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చిన ఆదేశాలను హై కోర్టు రద్దు చేసింది. పౌర, పవన విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ మస్ట్‌రన్ నిర్వచనంలోకి వస్తాయని, ఈ నేపధ్యంలో వాటి విద్యుత్‌ను తీసుకోవాల్సిందే అని, ఉత్పత్తిని తగ్గించాలని కొరలేమని హై కోర్టు తేల్చి చెప్పింది.
మొత్తం మీద గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏల ఒప్పందం పై జగన్ నిర్ణయం ఏకపక్షమని హై కోర్టు తీర్పుతో మరోసారి స్పష్టం అయ్యింది.
Must Read:-సిక్కోలు లో హోరెత్తిన తెలుగుదేశం | Huge Response for TDP Gourava Sabha in Sikkolu | Leo News