ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం సిద్దమైంది. ఈ నెల 30 నుంచి ఐదురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగం నిర్ధేశించిన ప్రకారం ప్రతి ఆరు మాసాలకు ఒకసారి తప్పనిసరిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్వల్పకాలిక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే క్యాబినెట్ తీసుకున్న అనేక నిర్ణయాలకు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసుకునే అవకాశం ఉంది.
కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్తలు
ఏపీలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. సభ్యులందరికీ కరోనా టెస్టులు నిర్వహించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వైసీపీలో 12 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఏపీలో 15 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది.
Must Read ;- వీధి గుండాల్లా వైసీపీ నాయకుల బాహాబాహీ