అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ. 3 వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇచ్చేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో సమావేశమైన మంత్రి వర్గం దీనితో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.కమిటీ సూచించిన దాని కంటే కాకినాడ ఎస్ఈజెడ్ భూముల రైతులకు ఎక్కువ నష్టపరిహారం ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎస్ఈజెడ్ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపు ఇచ్చింది. వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భాగస్వామ్య సంస్థ ఎంపిక , ఈబీసీ కులాల మహిళలకు ఈబీసీ నేస్తం పథకానికి క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపైనా సమావేశంలో చర్చించారు.
Must Read ;- సీఎం జగన్ ఆమోదంతోనే ప్రైవేటీకరణ..