ఏపీలో జగన్ పాలనకు డ్రైవర్ ఢిల్లీలో ఉండి స్ట్రీరింగ్ ఎలా తిప్పితే అలా పోతుంటది. ఎవరిని బొంకల్లో వేయమంటే వారిని.. ఎవరిపై అధికారిక దాడులు చేయించమంటే వారిపై అన్నీ రకాల దాడులు చేయడం భయభ్రాంతులకు గురిచేయడం ఈనాటి కాదు. జగన్ గద్దెనెక్కిన నాటి నుంచి చూస్తుందే.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్ర రాజకీయాలు హింసాత్మాకంగా మారాయి. ఏపీలో ప్రస్తుతం అరెస్ట్ ల పర్వం నడుస్తోంది. పౌర, ప్రాథమిక హక్కులు కాల రాయపడుతున్నాయి. ప్రభుత్వాన్ని, జగన్ అనుసరిస్తున్న పాలనను ఏవరైనా దూషిస్తే.. అరెస్ట్ చేసి జైలుకు పంపాలని చూస్తున్నారు. అయితే ఈ దౌర్జన్యకాండ ఒక్క చంద్రబాబు అరెస్ట్ తో చల్లారడం లేదు. ఆ తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..,మాజీ మంత్రులు నారాయణ, దేవినేని, అచ్చెంన్నాయుడు తదితరులు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. దీంతో టీడీపీ ఆందోళనలతోపాటు ఆత్మరక్షణలో పడింది. అరెస్ట్ లకు భయపడేది లేదంటూనే.. న్యాయస్ధానాల్లో అక్రమ కేసులపై న్యాయపోరాటానికి దిగుతున్నారు. ఇవన్నీ కేంద్రం కనుసన్నల్లో సాగుతోందని వాదనాలు లేకపోలేదు. బీజేపీలోని వన్ .., టూ లకు తెలియకుండానే ఏపీలో ఈ రాజకీయ అనిచ్ఛితి నెలకొందా..?అంటూ సోషల్ మీడియా వేదికగా గుసగుసలు బాగానే వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రజలు.. టీడీపీ.., వైసీపీలపై ఒక క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో హస్తినకు అందుకోసమే జగన్ ను పిలుస్తున్నారని పలు అనుమానాలను అయితే సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు రాసుకొస్తున్నారు. చంద్రబాబు తరువాత ఎవర నెక్స్ట్ అరెస్ట్ చేయాలి..? మిగిలిన బ్యాలెన్స్ అరెస్ట్ లు ఇప్పుడే చేయాలా..? లేకుంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలా..? టీడీపీ వారితో పాటు ఈనాడు రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలజ పరిస్ధితి ఏంటి..? అన్న విషయాలపై క్లారిటీ కోసం బీజేపీలోని ఆ వన్ .. టూ లు జగన్ కు డైరెక్షన్ ఇస్తారని ఒక వర్గం వారు చెప్పుకొస్తున్నారు.
మరో వర్గం వారు చంద్రబాబును అరెస్ట్ చేసి.. ఏదో పొడవవాలనుకున్న జగన్ అండ్ కో కు.. ఏదో చేయాలని చూస్తే ..ఏదో జరిగిందని.. ఇప్పుడు ఇంకా అంత సాహాసం చేస్తారా..? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అదీకాక ఈ నెల ఉద్యోగుల జీతాలు.., కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు.., కొన్ని సంక్షేమ పథకాలకు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లు అవసరం.
దీనిపైనే జగన్ ఢిల్లీ పెద్దలను కలబోతున్నారని ఇంకో వర్గం చెప్తున్నారు. ఏదీఏమైనా ఢిల్లీ స్పెషల్ ఫ్లైట్ వెళ్తున్న సీఎం జగన్ కు ఆ పెద్దలు ఏ దారిలో ప్రయాణం చేయమంటారో చూడాలి.