AP CM Jagan Wear A Mask In Polavaram Tour :
కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో మాస్క్ చాలా ప్రధానమైంది. అందుకే సామాన్యుల మొదల సెలబ్రిటీల వరకు మాస్క్ ను ధరించడం విధిగా పెట్టుకున్నారు. ప్రభుత్వాలు కూడా మాస్క్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశాయి. మాస్క్ రూల్స్ బ్రేక్ చేసినవాళ్లను హెచ్చరించి, ఫైన్ విధించిన సంఘటనలున్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం మాస్క్ ధరించిన సందర్భాలున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాస్క్ ధరించిన సందర్భం చాలా తక్కువేనని చెప్పక తప్పదు. కరోనా విరుచుకుపడుతున్న సమయంలోనూ మాస్క్ నిబంధనను పట్టించుకోలేదు.
ఇక సభలు, సమావేశాలు, కేబినెట్ మీటింగుల్లో సైతం సీఎం జగన్ మాస్కు ధరించలేదనే విమర్శలున్నాయి. ప్రజలకు దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా? అని ప్రజలు సైతం విమర్శించిన సందర్భాలున్నాయి. ధర్డ్ వేవ్ ప్రభావమో, ఇతర కారణాలో తెలియదు కానీ.. పోలవరం పర్యటనలో మాస్క్ ధరించడం ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జగన్ సార్ లో.. ఇంత మార్పేంటి? అని చర్చించుకుంటున్నారు.
Must Read ;- బీజేపీ మంత్రిగారి ఘనకార్యం : కాలికి ఫేస్ మాస్క్!