ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యి కష్టసుఖాలు తెలుసుకునే నాయకులు చాలా అరుదు. అలాంటి నాయకుల సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇదే కోవకు వస్తారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తున్నారు చంద్రబాబు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి స్వయంగా తానే హాజరవుతున్నారు. దిగువ మధ్య తరగతి, పేద ప్రజలతో నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు. స్వయంగా తానే కాఫీలు, టీలు చేసి వారికి అందిస్తున్నారు. వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యలను అప్పటికప్పుడే, అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.
……………
చంద్రబాబు అనగానే ఐటీ అనే పేరు గుర్తు వస్తుంది. కార్పొరేట్ ముఖ్యమంత్రి అంటూ ప్రతిపక్షాలు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయన అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను చూపిస్తున్నారు. అమరావతి సహా ఇతర ప్రాజెక్టుల మీటింగ్స్‌కు హాజరైనప్పుడు తన క్లాస్‌ను చూపిస్తున్నారు. అన్ని వర్గాలకు తాను దగ్గరగా ఉన్నాననే భరోసా కలిపిస్తున్నారు. ఇదే జగన్ టైంలో చూస్తే ఆయన కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే పరిమితమయ్యారు. ప్యాలెస్‌లో ఉంటూ ప్రజలకు దూరమయ్యారు.
……………
చంద్రబాబునాయుడు P4 స్కీమ్‌ను అమలు చేస్తున్నారు. ఈ పథకం ఉద్దేశం నేరుగా ఆర్థిక సాయం చేయడం కాదు. ఓ పూట కడుపు నింపడం కన్నా..వారికి ఆ ఆహారం సంపాదించుకునేలా శక్తిని ఇవ్వడం ముఖ్యమని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే ధనవంతుల్ని ఇందులో భాగస్వామ్యం చేసి..ఆయా కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఏ కుటుంబానికి ఎలాంటి సాయం అవసరమన్నది ప్రత్యేకంగా అసెస్ మెంట్ జరుగుతోంది.
……………..
చంద్రబాబు ప్రతి నెలా ఓ పేద కుటుంబం స్థితిగతుల్ని నేరుగా పరిశీలిస్తున్నారు. అందులో అన్ని వర్గాల వారూ ఉంటున్నారు. ఓ బార్బర్ , మరో చర్మకారుడు ఇలా ..బడుగుల్లో.. కులవృత్తి చేసుకుంటున్న వారిలో పేదల్ని ఎంచుకుని వారితో మాట్లాడి..వారి ఎదుగుదలకు అడ్డు పడుతున్న అంశాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారా ప్రభుత్వ పరంగా వారికి చేయాల్సిన సాయాల్లో..అందించాల్సిన సహకారాల్లో మార్పులు చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ఆకట్టుకుంటోంది. చంద్రబాబు ఏ మాత్రం అరమరికల్లేకుండా..తన కాన్వాయ్ లో కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడుతున్నారు. కుటుంబసభ్యుడిలాగా మారి బతుకులు మారతాయని నమ్మకాన్ని ఇస్తున్నారు.
………………..
చంద్రబాబు ఇలా పేదల ఇంటికి వెళ్లి..సాయం గురించి వాకబు చేయడం, దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ విధానంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ ముఖ్యమంత్రి ఇలా నేరుగా పేదల ఇళ్లకు వెళ్తే..ఎన్నో మార్పులు వస్తాయని గట్టి నమ్మకం వ్యక్తమవుతోంది. చంద్రబాబు పెన్షన్ల పంపిణీ, ఆ తర్వాత పేదలతో నేరుగా మాట్లాడే విధానం దేశ రాజకీయాల్లో కచ్చితంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుంది.
ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్ ప్లాంట్..
ఆంధ్రప్రదేశ్‌కి పరిశ్రమలు వరుస కడుతున్నాయి. రాష్ట్రంలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది....











