ఏపీ ప్రభుత్వంపై కాంట్రాక్టర్లు యుద్ధం ప్రకటించనున్నారు. జగన్ రెడ్డి అండ్ కో ను నమ్మి కాంట్రాక్టు పనులు చేసిన పాపానికి ఆత్మహత్య చేసుకుని పరిస్ధితికి దిగజారారు కాంట్రాక్టర్లు రోధిస్తున్నారు.
ఏపీలో పలు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు వర్క్స్ చేసిన దాదాపు 2 వేలకు పైగా ఉన్న గుత్తేదారులు నేడు రోడ్డున పడ్డారు. వీరందరూ ప్రభుత్వాన్ని నమ్ముకుని సర్వం కోల్పోయి, అప్పుల భారీన పడ్డారు. కాంట్రాక్టర్లను నమ్ముకుని అనుబంధ రంగ కార్మికులు సైతం దాదాపు 30 వేల మంది ఉపాధిలేక వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సి వచ్చింది.
ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు విద్యాశాఖ, ఆర్ డబ్లూఎస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల్లో కాంట్రాక్టు వర్క్స్ చేసిన బిల్లులు దాదాపు 20 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు ప్రాథమిక అంచనకు వచ్చారు. ఈ నాలుగేళ్ళల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్ల దాదాపు 40 వేల కోట్లకు పైగా పనులు చేయగా.. వాటికి బిల్లులు చెల్లించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను భరించలేక.., సకాలంలో చేసిన వర్క్స్ కు బిల్లులు రాక దాదాపు 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు.
తక్షణమే చేసిన పనుల తాలుక బిల్లులు ఇవ్వకుంటే కార్యచరణ చేపడుతామని హెచ్చరించారు. పులివెందుల, డోన్ నియోజకవర్గాల కాంట్రాక్టర్లపై చూపే ప్రేమ జగన్ నమ్మి కాంట్రాక్టు వర్క్స్ చేసిన మిగతా వారిపై కూడా సమానంగా చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ రెండు నియోజకవర్గాల వారికీ బిల్లుల ఇస్తూ..తమకు అన్యాయం చేస్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
ఇప్పటికైనా తాము చేసిన కాంట్రాక్టు వర్స్స్ బిల్లులను విడుదల చేయాలని.. అలా కాకుంటే.. ప్రభుత్వంపై యుద్ధం చేసైనా సరే పెండింగ్ లో ఉన్న బిల్లులను సాధించుకుంటామని హెచ్చరిస్తున్నారు కాంట్రాక్టర్లులు. నిరవాదిక నిరసనలతో తమ గళాన్ని వినిపిస్తామని కార్యచరణను మొదలు పెట్టారు.