రాజకీయ పాపాలు.. యువతకు శాపాలు అన్న సూక్తి ఏపిలో జరుగుతున్న డ్రగ్స్ దందా చూస్తే ఇట్టే బోధపడుతోంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం చేసే పాపాలు.. రాష్ట్రంలో యువతకు శాపంగా మారుతున్నాయి. విశాఖ మన్యంలో గతంలో ఎన్నడూ లేనంతగా గ్రూపులు కట్టి మరి ముష్కర మూకలు పెద్దఎత్తున గంజాయి సాగుకు పూనుకున్నాయి. ఈ దుశ్చర్యల ఫలితమే ఏపితోపాటు పక్కరాష్ట్రాలకు మత్తు చేటుకాలంగా దాపురించింది. అందుకు నిదర్శనమే నిన్న విశాఖ కేంద్రంగా డీజీపీ అధ్యక్షత తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పోలీస్ ఉన్నతాధికారుల అత్యవరస సమావేశం. ఈ సమావేశం సాక్షిగా డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడిన తీరు సర్వత్ర విస్మయానికి గురిచేస్తోంది. ఏజెన్సీలో 15 వేల ఎకరాల్లో( అధికారుల లెక్కప్రకారం ) గంజాయి సాగవుతోంది. సరాఫరాలోనూ, రవాణాలోనూ, స్వదేశంతోపాటు విదేశాలకు ఎగుమతులోనూ ఐదు రాష్ట్రాలకు చెందని మాఫియా ముంబాయి బేస్ గా నడుస్తోంది అన్న ప్రచారం కోడై కూస్తున్నా .. డీజీపీ మాత్రం సమస్య తీవ్రతను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారనే వాదనలు లేకపోలేదు. అధికార పార్టీ రాజకీయాలు చూసిచూసి.. వినివిని కాబోలు ప్యానిక్ ను డైవర్షన్ ను కళ్ళకు కట్టారు. ఏజెన్సీలో విసృత స్థాయి సాగు రూపం దాల్చిన గంజాయి మూలాలను వెతకడం మాని, ఆ పాపాన్ని మావోయిస్టులపై తోశారు. ఇక్కడ మావో చర్యలను సమర్ధిస్తున్నట్లు కాదు .. ఏజెన్సీలో విశృంఖలుగా సాగుతున్న మాఫియా ఆగడాలను ఎండగట్టడమే. డీజీపీ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే .. ‘వెనకటికి ఓ సినీమా డైలాగ్ గుర్తొచ్చింది .. ఆ సినీమాలో ప్రజా నాయకుడిగా ఆధరణ పొందుతున్న ఓ నాయకున్ని వేరే పక్షం వారు హత్య చేస్తారు.. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు పత్రికల్లో తాటికాయాంత అక్షరాల్లో.. ఆ నాయకున్నీ తీవ్రవాదులు కాల్చి చంపారని.’ఈ సన్నివేశాన్ని ఇంతకన్నా విడమరిచి చెప్పనక్కర్లేదనుకుంటా. దీనిని బట్టి అర్థమయ్యే నగ్న సత్యం ఎంటంటే .. ‘రాజకీయ రంగు పులుముకున్న ప్రతి క్రైం కు కారకులు.. నక్సల్స్, ఎక్కడో కశ్మీరంలో ఉన్న తీవ్రవాదులే.’వీరిని బాధ్యులను చేయడం సినీమాలోనే కాదు నిజ జీవితంలోనూ రోటీన్ అని విమర్శలు లేకపోలేదు. ఏఓబిలో అనదికార లెక్కల ప్రకారం వేల ఎకరాల్లో గంజాయి సాగు వెనుక ప్రత్యక్ష్యంగా మాఫియా ఉంటే .. పరోక్షంగా లోకల్ రాజకీయాలు ఈ అక్రమ దందాకు తెరతీశాయని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున ఆరోపిస్తున్న తత్వం బోధపడకపోవడం విచారకరం.
గంజాయిపై టీడీపీ యుద్దంతోనే ఫలితాలు
దేశంలో గంజాయి రవాణాకు ఏపి కేంద్రబిందువుగా ఉంది అన్నది వాస్తవం. గతంలో ఎన్నడూ లేని విధంగా గంజాయి సాగుకు గల కారణాలను వెతికి ఎత్తిచూపడం అప్రస్తుతమైనా .. అనాలోచిత స్వార్థ రాజకీయాలకు బలవుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని, యువతను చూసి విచారించక తప్పదు. మితిమీరిన మద్యం ధరలు, విదేశాల్లో గంజాయి వాడకంపై ఎత్తివేసిన నిషేధాజ్ఞల ఫలితమేమో కాబోలు .. ‘ఏవోబి లో 15 వేల పైచిలుకు ఎకరాల్లో గంజాయి సాగు పురుడుపోసుకుంది. ఎక్కడ గంజాయి పట్టుకున్న ఏపి డీజీపీ కార్యాలయానికి ఫోన్ వస్తోంది.. మన్యంలో ఏం జరుగతోందని.’ఏజెన్సీలో తెరలేపిన వికృత క్రీడను టీడీపీ ఆది నుంచి హెచ్చరిస్తూనే వస్తోంది. మాఫియా అండదండలతో ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి రాజకీయ రంగుపులుముకుని యువతను నాశనం చేస్తోందని వస్తున్న ఆరోపణలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఆ నిర్లక్ష్యమే కాస్తా.. మొక్క మానై ప్రస్తుతం ప్రభుత్వ కూసాలను కదిలించేస్తోంది. గంజాయి మూలాలను వెతికి ఆ మాఫియాను కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు తెలుగుదేశం పార్టీ యుద్దం ప్రకటించింది. ఆ యుద్దాన్ని పూర్తిస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడంలో పట్టాభి విజయం సాధించారనే చెప్పవచ్చు.
అప్పుడు వదిలేసి.. ఇప్పుడెందుకు దిద్దుబాటు..
రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగిన దాని పూర్వాపరాలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాలి .. అది ముఖ్యమంత్రి దృష్టికి రావాలి. అది పాలనలోని సమర్థత. ఆంధ్రా, బడిసా బోర్డర్లో గంజాయి పెద్దఎత్తున సాగుకు సన్నద్దం అవుతున్నారన్న సమాచారం అక్కడి అధికారులకు, స్థానిక పాలకులు వద్ద ఎందుకు లేదు అన్నది ప్రతిపక్షాల ఆరోపణలు. కొత్తవారి కదలికలు, రవాణాపై నిఘా, స్థానికుల యాక్టీవిటీస్ పై అక్కడి అధికారులు, స్థానిక నాయకులు ఎందుకు దృష్టిపెట్టలేకపోయారన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. సాంకేతిక వింతపుంతలు తొక్కుతున్న వేళ .. ఏపి పోలీసు యంత్రాంగం ఎందుకు అటువంటివాటిపై దృష్టిసారించి, నియంత్రించలేని పరిస్థితిలో ఉందో అన్న అనుమానాలు కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. నిన్న విశాఖ నోవోటెల్ హోటల్లో ఐదు గంటలు పాటు ఆరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికాదుల సమావేశం వేదికగా ఏపి డీజీపీ గౌతం చేసిన వాఖ్యాలు కూడా ఈ చర్చలో పరిగణాలోకి తీసుకోవాలి. అలానే జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు కూడా ప్రస్తవించాలి. ఏపిలో డ్రగ్ సరాఫరాలేదని, గంజాయి మాత్రం సాగు, రవాణాపై మాత్రం ఉక్కుపాదం మోపుతామని చెప్పారు రాష్ట్ర డీజీపీ. అవసరమైతే డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని ఆయన ప్రకటించారు. అంతకన్నా ముందుగా విశాఖలో ఉన్న జనసేనాని కూడా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని వినియోగిస్తే 48 గంటల్లో గంజాయిని కంట్రోల్ చేయవచ్చునని సూచనలు చేశారు. కొన్నిరోజులకు మునుపు రాష్ట్రం డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నప్పుడు ఏజెన్సీలో పెత్తనం చేస్తున్న లోకల్ నాయకులు అరణ్యంలో పడి సాగుచేస్తున్న గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. దీనిని బట్టి చూస్తే .. అధికారపార్టీ లోకల్ నాయకులకు తెలియకుండానే ఈ మాఫియా అక్కడ వేళ్లూనుకుపోయిందా అన్న సందేహాలు లేకపోలేదు. కేసుల విచారణలో పోలీసులకు కూడా స్వేచ్ఛ లేదు అన్నది జనసేనాని వ్యాఖ్యాలతో తేలిపోయిందని చెప్పక తప్పదు.
must read ;- పట్టాభి అరెస్ట్ అక్రమం!.. ఇదిగో సాక్ష్యం!