రైతుకు పెద్దపీట వేస్తాం.. సాగునీరు, సబ్సిడీలపై ఎరువులు, పురుగు మందులు ఇస్తాం.., సాగునీరు లేని చోట ఉచితంగా బోర్లు వేసి.. వ్యవసాయాన్ని స్ధిరీకరిస్తాం అన్న జగన్ రెడ్డి హామీ నేడు ఏమైందని రైతులు నిలదీస్తున్నారు.
ఏపీలో దగా కోరు పాలన సాగుతోంది. 2019 ఎన్నికల్లో అన్ని వర్గాల వారికీ అనేక హామీలిచ్చి నిలువునా మోసం చేసిన వ్యక్తి నవమోసాల రెడ్డి జగన్. ఆ ఉత్తుత్తి హామీలను నమ్మి రోడ్డున పడ్డవారిలో రైతులు కూడా ఉన్నారు. ఈ నాలుగునరేళ్ళల్లో వ్యవసాయం నానా విధాలుగా నాశనం అయింది. దార్శినికత లేని జగన్ రైతును అన్ని విధాలుగా ముంచాడు. విత్తు దశ నుంచి దగాపడ్డ రైతు..అధిక పెట్టుబడి పెట్టి అప్పులు పాలైయ్యాడు.
సాగునీరు లేక పోలాలు ఎండిపోతుంటే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ను సబ్సిడీ పై అందించి.. రైతులను ఆదుకున్నారు. అయితే జగన్ 2019లో రైతులకు ఉచితంగా బోర్లు వేపిస్తానని హామీ ఇచ్చిన జగన్ దాన్ని మరిచాడు. మాట తప్పారు..మడమ తిప్పారు… అన్నదానిపై క్లారిటీ ఇచ్చాడు జగన్. దీంతో రైతు రోడ్డున పడ్డారు. ప్రకటించిన ఉచిత బోర్ల పథకం అటకెక్కితే చివరికి గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొచ్చిన జల సిరే నెర్రిలిచ్చిన భూములకు సేద తీరుస్తోంది.
రైతను విత్తు దశ నుంచే దగా చేసి.. ఇస్తానన్న పథకాలు.., కనీస మద్దతు ధర అందించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైదని చెప్పాలి. జలయజ్ఞం పేరుతో జరిగిన ధనయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులన్నీ వివిధ దశలో ఆగిపోయి.. నత్తకు నడక నేర్పుతున్నాయి. వెలిగొండ, గుండ్లకమ్మ, పోలవరం, వరికిపూడిశెల.. ఇలా చెప్పుకుంటూ పోతే.. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. రైతును ఆదుకుంటానని చెప్పిన జగన్ .. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ హామీ మరిచాడు.
గత వందేళ్ళల్లో ఎన్నడూ చూడని కరువును నేడు ఏపీ రైతులు చవిచూస్తున్నారన్నది వాస్తవం. చంద్రబాబు హయంలో దాదాపు 27 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశాడు. దాదాపు 64 వేల కోట్లను ఇరిగేషన్ పై ఖర్చు చేశారు చంద్రబాబు. పట్టిసీమను విమర్శించిన జగన్ .. బాబు కట్టిన ఆ పట్టిసీమ నుంచే నేడు సాగునీటిని గుంటూరు, కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ఈ నాలుగునరేళ్ళ జగన్.. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయపోగా.. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల్ని కర్నాటక, తెలంగాణకు ధారదత్తం చేశారు జగన్. ఉచిత బోర్లు హామీని ఏం చేశారు రెడ్డిగారు అని నేడు రైతులు నిలదీస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు.., రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాలో జగన్ వైకరిని తప్పుబడుతున్నారు. ఆయన పోకడలను దుమ్మెత్తిపోస్తున్నారు.