AP Government Transferred Praveen Prakash From CMO :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద సుధీర్ఘంగా పనిచేసిన అధికారులు ఎవరు? అని తిరిగి చూసుకుంటే.. ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించరేమో. ఎందుకంటే.. తాను ఏరి కోరి తెచ్చుకున్న అధికారులను కూడా జగన్ ఎక్కువ కాలం నమ్మడం లేదు. నమ్మడం అటుంచితే.. తన వద్ద పనిచేక సదరు అధికారులకు అసలు కీలక పోస్టింగ్ లు దక్కడం లేదు. కీలక పోస్టింగ్ ల మాట అటుంచితే.. అసలు పోస్టింగ్ లే దక్కని వైనం నిజంగానే చర్చనీయాంశం అవుతోంది. సీఎంఓలో అన్నీ తానై వ్యవహరిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే కూడా కీలకంగా పనిచేస్తున్నసీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ను సీఎంఓ నుంచి దాదాపుగా గెంటేసినంత పనిచేసిన వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తొలుత ఎల్వీ.. తర్వాత పీవీ రమేశ్
సరిగ్గా 2019 ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి.. ఆ పోస్టులో తనకు అనుకూలంగా వ్యవహరిస్తారని భావిస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం నియమితులైన సమయంలో జగన్ మహదానందపడిపోయారు. ఎల్వీని అడ్డం పెట్టుకుని తనదైన శైలిలో చక్రం తిప్పిన జగన్ ఎన్నికల్లో గెలిచేశారు. అందుకు కృతజ్ఞతగా ఎల్వీని సీఎస్ గానే కొనసాగించిన జగన్.. ఆ తర్వాత ఏమైందో గానీ..సీఎస్ పదవి నుంచి ఆయనను దించేసి ఏ ప్రాధాన్యం లేని పోస్టులో నియమించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎల్వీ.. ఆ పోస్టులో చేరకుండానే రిటైర్ అయిపోయారు. ఆ తర్వాత తాను ఏరికోరి మరీ రిటైరైనా కీలక పదవిలో నియమించుకున్న పీవీ రమేశ్ విషయంలోనూ జగన్ ఇలాగే చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన పీవీ రమేశ్.. జగన్ కు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి పదవి నుంచి తప్పుకునక్న వైనం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రవీణ్ నూ గెంటేసినట్టేనా?
ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ వంతు వచ్చింది. జగన్ సీఎం అయిన తర్వాత ఎక్కడో డిల్లీలో ఉన్న ప్రవీణ్ ను పిలిచి మరీ రాష్ట్రానికి రప్పించారు. సీఎంఓలో కీలకమైన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. పేరుకే ఆ పోస్టు గానీ.. జగన్ ఇచ్చిన అమితమైన అధికారంతో ప్రవీణ్.. సీఎస్ ను కూడా లెక్క చేయని రీతిలో వ్యవహరించిన తీరు పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఏమైందో తెలియదు గానీ.. మంగళవారం సాయంత్రం ప్రవీణ్ ను సీఎంఓ నుంచి గెంటేసినంత పనిచేశారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయనను అక్కడి నుంచి బదిలీ చేసి ఆయన బాధ్యతలను తాత్కాలికంగా రేవు ముత్యాలరాజుకు అప్పగించారు. ప్రవీణ్ ను సీఎంఓ నుంచి తప్పించిన వైనంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది.
Must Read ;- జగన్ ను బుగ్గన అడ్డంగా ఇరికించేశారే











