జంటకవులుగా సోషల్ మీడియాలో గుర్తింపు దక్కించుకున్న అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా.??. ఆ ఇద్దరిపై త్వరలోనే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోందా..?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది..
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కేసులో రాష్ట్ర గవర్నర్ నజీర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈ కేసుకి సంబంధించిన వివరాలను ఎందుకు వివరించలేదంటూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తమ అధికార పరిధిని దుర్వినియోగం చేసి, నియమ నిబంధనలు ఉల్లంఘించి సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పక్క రాష్ట్రాలకు వెళ్లి ప్రెస్ మీట్‌లు పెట్టడంపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ యూనైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్‌కి చెందిన సత్యనారాయణ గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరి తమ పరిధిని మించి ప్రెస్ మీట్‌లు నిర్వహించడం చట్టాలను, నిబంధనలు తుంగలో తొక్కడమే అని గవర్నర్ నజీర్‌కి లేఖ రాశారు.. ప్రజాధనంతో వారు అవసరం లేకపోయినా ఢిల్లీ, హైదరాబాద్ లాంటి రాష్ట్రాలలో విలేఖరుల సమావేశాలు ఏర్పాటు చేశారని ఆధారాలతో సహా గవర్నర్‌కి సమర్పించారు..
సత్యనారాయణ ఫిర్యాదును పరిశీలించిన గవర్నర్ వెంటనే చర్యలకు ఉపక్రమించారు.. ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖకు సిఫారసు చేశారు.. హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత గవర్నర్ నజీర్ లేఖపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది చర్చనీయాంశంగా మారింది.. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఆధ్వర్యంలోనే చంద్రబాబు చుట్టూ కేసులు నడుస్తున్నాయనే వాదన ఉంది.. మరి, అలాంటి ప్రభుత్వం ఈ ఇద్దరు జంట కవులపై చర్యలు తీసుకుంటుందా.?. గవర్నర్‌కి తిరిగి నివేదిక ఇస్తారా?? అనేది బిగ్ పజిల్..