భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రూ.100తో రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ విధానం పేదల భూమి సమస్యలను పరిష్కరించడానికి, వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
రూ.10 లక్షల విలువ వరకు ఉన్న వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్‌లు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్టిఫికెట్‌ను గ్రామ/వార్డు సచివాలయాల్లో కేవలం రూ.100 చెల్లించి పొందవచ్చు. ఈ సౌకర్యం ద్వారా భూమి యాజమాన్య హక్కులను సులభంగా ధృవీకరించుకోవచ్చు. రూ.10 లక్షలకు మించిన విలువైన వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీగా రూ.1,000 వసూలు చేస్తారు. ఈ రుసుము సాధారణ రిజిస్ట్రేషన్ ఛార్జీల కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల పేద, మధ్య తరగతి వారికి ఆర్థిక భారం తగ్గుతుంది.
ఈ సేవలు గ్రామ/వార్డు సచివాలయాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి. భూమి వివరాలు (సర్వే నంబర్, ఖాతా నంబర్, ఆధార్ నంబర్ , యజమాని పేరు సమర్పించాలి. ఆధార్ కార్డ్, భూమి రికార్డులు ఇతర గుర్తింపు రుజువులు చూపించాల్సి ఉంటుంది. వారసత్వ భూముల రికార్డులను తనిఖీ చేయడానికి మీ భూమి పోర్టల్ ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్‌లో అడంగల్, ROR-1B, విలేజ్ మ్యాప్, ఆధార్ లింకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.











