ఏపీలో పంచాయతీ ఎన్నికల ఈ నెల 21తో ముగియనున్నాయి. వెను వెంటనే మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించడానికి ఎస్ఈసీ సమాయత్తమవుతుంది. అందుకోసం నోటిఫికేషన్ విడుదలు చేసింది. గతేడాది మార్చిలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయినందున.. అప్పుడు ఎక్కడ ఆగిందో, ఇప్పుడు అక్కడ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ఈసీ ఎన్నికలు నిర్వహించనుంది. గతేడాది ఆగిన ప్రక్రియ నుంచే తిరిగి ప్రారంభించాలని ఈసీ నిర్ణయించింది. మార్చి 2,3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తున్నట్లు ఈసీ తెలిపింది. మార్చి 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే మార్చి 13న రీపోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది.
నిజానికి, రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గతేడాది మార్చి 23వ తేదీన ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అదే నెల 11వ తేదీన నోటిఫికేషన్ను జారీ చేసింది. 11,12 తేదీల్లో అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అదే సమయానికి దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ కరోనా విస్తరిస్తుండడంతో.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్నకలను వాయిదా 6 వారాలపాటు వాయిదా వేస్తూ.. గతేడాది నామినేషన్ల ఉపసంహరణ రోజునే.. మార్చి 15న ఉత్తర్వులు జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇప్పుడు ఈ ప్రక్రియను కొనసాగించడానికి పూనుకున్నారు నిమ్మగడ్డ. అందుకు నోటిఫికేషన్ విడుదల చేసి.. గతేడాది ఎక్కడ ఆగిందో.. అక్కడ నుంచి ప్రారంభించనున్నట్లు ఈసీ తెలిపింది. కోర్టు కేసుల కారణంగా నెల్లూరు, రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా.
Must Read ;- ఫిర్యాదులు పరిశీలించి చర్యలు తీసుకోండి.. ఏకగ్రీవాలపై ఎస్ఈసీకి హైకోర్టు సూచన