ప్రభుత్వాధిపతి ఒక సైకో అయితే ఉన్నతాధికారులు ఏ స్థాయిలో ఇబ్బంది పడతారో చెప్పేందుకు ఉదాహరణ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిజాయతీ పరుడైన ఈ ఐపీఎస్ అధికారి ఐదేళ్లుగా టార్చర్ అనుభవిస్తూ వచ్చారు. తప్పుడు కేసులతో కోర్టుల వెంట తిప్పుతూ వేధించారు. చంద్రబాబు హాయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేశారు. అదే ఆయన పాలిట శాపం అయింది. జగన్ అధికారంలోకి వచ్చాక ఏ ఆధారాలు లేకుండా ఆయనపై సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకున్నారు. ఏబీవీ చేసిన తప్పేంటో చెప్పకుండా ఆయనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని రెండు సార్లు యూపీఎస్సీకి సిఫారసు కూడా చేసింది జగన్ సర్కారు. ఆధారాలుంటే చర్యలు తీసుకోమని యూపీఎస్సీ చెప్పగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఏబీవీపై ఏ చర్యలు తీసుకోలేకపోయింది.
ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో ఏప్రిల్ 13న క్యాట్‌పై విచారణ చేయనుంది. అదే రోజు తీర్పు వెలువడుతుందని అంటున్నారు. క్లీన్ చిట్ వస్తే కనుక ఏబీవీకి డీజీపీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీసు అధికారుల్లో ఆయనే సీనియర్. డీజీపీ అయ్యే అవకాశాలు ఆయనకే ఉన్నాయి. ప్రభుత్వం పగబట్టడం వల్లే ఈ ఐదేళ్ల కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు అన్ని అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది. నిజానికి ఏబీ వెంకటేశ్వరరావు వచ్చే నెలలో రిటైర్ కావాల్సి ఉంది. కానీ, ఐదేళ్లుగా నిరాధార ఆరోపణలతో సస్పెన్షన్ లో ఉండడం వల్ల.. యూపీఎస్సీ న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. అంటే సర్వీసును మరో ఐదేళ్లు పెంచుతుందని అంటున్నారు. ఇదే జరిగితే ఏబీవీకి డీజీపీ అవకాశం వచ్చినట్లే అవుతుంది.
ఇది ఏపీలో సంచలనం అవుతుంది. ఆయనను వేధించిన జగన్ కు గట్టి షాక్ తగిలినట్లవుతుంది. ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేళ బదిలీల పర్వం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇటీవల ముగ్గురు ఐఏఎస్, ఆరుగురు ఐపీఎస్ అధికారులు ట్రాన్స్ ఫర్ అయ్యారు. జగన్ అనునాయుడు అయిన కొల్లి రఘురామిరెడ్డి కూడా వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మరికొందరు పక్షపాతులైన ఉన్నతాధికారులను కూడా ఎన్నికల సంఘం టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అవుతారనే చర్చ బలంగా సాగుతోంది.
డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అయితే, ఆయన స్థానంలో జగన్ ప్రభుత్వ బద్ధ శత్రువైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వస్తారని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ సర్కారు ఆరోపణలు మోపినప్పటికీ ఆధారాలు మాత్రం ఏమీ లేవు. కాబట్టి ఏప్రిల్ 13న జరిగే తుది విచారణలో ఏబీ వెంకటేశ్వరరావుకు క్లీన్ చిట్ రావడం ఖాయమనే భావిస్తున్నారు.