ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ని…. రండి రండి దయ చేయండి.. మీ రాక మాకెంతో సంతోషం సుమండి.. మా వీధికి వస్తే మీకు వందనాలు అండి అని పాటలు పాడుతున్నారు ఏపీ ప్రజలు.. జగన్ ముఖ్యమంత్రి హోదాలో తమ ప్రాంతానికి ముఖ్యంగా తమ వీధులకి వస్తే ఆయనకు భారీగా స్వాగత సత్కారాలు పలుకుతామని చెబుతున్నారు.. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు..
అసలు వాస్తవం ఏంటంటే.. రాష్ట్రంలోని మారుమూల గ్రామాలలోనే కాదు, పట్టణాల్లోనూ ఏ వీధి రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం… ప్రతి రోడ్డూ గుంతలమయం.. అనేలా మారిపోయింది సీన్.. కొన్ని గ్రామాలలో మోకాళ్లలోతు గుంతలతో దారుణంగా మారిపోయాయి రహదారులు. జాతీయ రహదారులను మినహాయించి అన్ని రోడ్లదీ సేమ్ సీన్.. సంక్షేమం పేరుతో అభివృద్ధిని అటకెక్కించి పప్పు బెల్లాలు పంచిపెడుతూ మరోసారి అధికారం దక్కించుకోవాలని ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు జగన్.. ఇటు, రాష్ట్రంలో పరిశ్రమలు, ఉద్యోగం, అభివృద్ది అనే అంశాలతో సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా ఆయన లైట్ తీసుకుంటున్నారు..
ఈ విషయం సాధారణ ప్రజలకు సైతం అర్ధం అయింది.. అందుకే, సీఎం జగన్ పర్యటిస్తున్న పట్టణాలలో రోడ్లకు కాస్త మరమ్మతులు చేస్తున్నారు.. తాత్కాలికంగా అయినా గుంతలు పూడుస్తున్నారు.. తారు వేయడం, గుంతలు లేకుండా సాఫీగా చేస్తున్నారు.. ఈ దృశ్యాలను టీవీలలో చూస్తున్న ప్రజలు.. జగన్‌పై సెటైర్లు వేస్తున్నారు.. ముఖ్యమంత్రి జగన్ గారు.. దయచేసి మా గ్రామాలలో ముఖ్యంగా మా వీధులలో పర్యటించండి అని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.. కొందరయితే థంబ్‌నెయిల్స్, ఇమేజెస్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు..
ప్రతిపక్షాల గొంతు నొక్కి, ప్రతిపక్ష నేతల వాయిస్‌ని అణగదొక్కుతున్న జగన్‌కి… ప్రజల ఆర్తనాదాలు, ఆక్రందనలు వినిపిస్తాయా.?? సంక్షేమం కోసం పందేరం చేస్తూ, అభివృద్ధిని ఆమడదూరంలో నిలిపిన జగన్‌కి…. ఈ ప్రజల పిలుపు వినిపిస్తుందా..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..