వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం. జగన్ సర్కారు కేంద్ర పథకాలను నిర్వీర్వం చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవే పథకాలను రాష్ట్ర అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకొంటోంది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల శిక్షణ కోసం తీసుకొచ్చిన రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అమలులో 24వ స్థానంలో ఉన్న ఏపీని.. టాప్ ప్లేస్‌కి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. నిత్యం పర్యవేక్షించడం ద్వారా ఈ రికార్డు సాధ్యమైంది.
రాష్ట్రంలోని పంచాయతీల సర్పంచులు, వార్డు మెంబర్లు.. ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు, పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో 3 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. 2025 – 2026 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2 లక్షల 56 వేల మందికి ట్రైనింగ్ పూర్తి చేశారు. పంచాయతీల ఆదాయం పుంపు, మహిళా ఫ్రెండ్లీ పంచాయతీ మోడల్, ఎంపీడీఓలు, డీడీఓలు, జూనియర్ అసిస్టెంట్లకు ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ అందించడం ద్వారా.. స్థానిక సంస్థలు, ఉద్యోగుల సామర్ధ్యం పెంచేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు కృషి చేశారు.
విశాఖపట్నం ఐఐఎం నేతృత్వంలో 500 మంది పంచాయతీరాజ్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఎన్‌ఐఆర్‌డీ ఎంఓయూ చేసుకొంది. మొదటి బ్యాచ్‌లో 57 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం ద్వారా గ్రామీణ ప్రజలకు మేలు జరుగుతుందని ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ భావించారు. అందుకే రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకాన్ని పక్కాగా అమలు చేసి.. రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపారు. విజయనగరంలోని గిరిజన సెంట్రల్ యూనివర్శిటీలో.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు











