ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ (2026-27) సెప్టెంబర్ నెలలో ఏకంగా రూ.4,986.18 కోట్ల గ్రాస్ టాక్స్ రెవెన్యూ సాధించింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో వచ్చిన రూ.4,334.84 కోట్లతో కంపేర్ చేస్తే ఇది ఏకంగా 15.03 పర్సెంట్ గ్రోత్. అంటే ఒక్క నెలలోనే దాదాపు రూ.651.34 కోట్ల అదనపు ఆదాయం డిపార్ట్మెంట్కు వచ్చింది.
దీంతో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ హాఫ్ (ఏప్రిల్ నుండి సెప్టెంబర్) మొత్తం కమర్షియల్ టాక్స్ కలెక్షన్స్ రూ. 30,435.98 కోట్లకు రీచ్ అయ్యాయి. లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే ఇది 18 పర్సెంట్ ఎక్కువ కావడం విశేషం. ఇక నెట్ జీఎస్టీ గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ 14.10 పర్సెంట్ సాధించి, జాతీయ సగటు 8 పర్సెంట్ కంటే చాలా ముందుకు వెళ్లింది.
సెప్టెంబర్ నెలలో నెట్ GST రూపంలో రూ.3,182.87 కోట్లు రాగా (14.1% గ్రోత్), IGST సెటిల్మెంట్ 20.1 పర్సెంట్ పెరిగి రూ.1,927.62 కోట్లు సాధించింది. ఇక పెట్రోల్, డీజిల్‌పై వచ్చే వ్యాట్ రూ.1,666.91 కోట్లు రాగా, ఇది గతేడాది కంటే 20.77 పర్సెంట్ పెరిగింది.
మరోవైపు ప్రొఫెషనల్ టాక్స్ 3.99 పర్సెంట్ పెరిగి రూ.43.53 కోట్లకు, లిక్కర్ వ్యాట్ 3.7 పర్సెంట్ గ్రోత్తో రూ.86 కోట్లకు చేరింది. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో స్టేట్‌లో బిజినెస్ యాక్టివిటీస్ ఊపందుకోవడం, టాక్స్ కలెక్షన్ సిస్టమ్‌ను ట్రాన్స్పరెంట్గా మార్చడం వల్లే ఈ రేంజ్లో ఇన్కమ్ సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు.











