తెలంగాణ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్నవాళ్లకే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్నారు. చదువుకున్న అందరికీ ఉద్యోగాలు రావడం కష్టమని అన్నారు. తెలంగాణలో హమాలీ పనికంటే మించిన ఉపాధి ఏముందని ప్రశ్నించారు. కామన్ సెన్స్ లేకుండా.. కొంతమంది కొలువులు ఇవ్వట్లేదని విమర్శలు చేస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల పని ఉపాధి కాదా.. అని మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిరంజన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపుతోంది
వీ వాంట్ హమాలీ జాబ్
ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పులు చెబుతుంటే.. మంత్రులు పొంతన లేకుండా మాట్లాడటం పలు విమర్శలకు దారి తీస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు చేసి పోలీసులు లాఠీల దెబ్బలు సైతం తిన్నామని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ లో బర్లు, గోర్లు కాయడమే కాదు.. హమాలీ పని కూడా చేసుకోవాలా? అంటూ నిరుద్యోగులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ‘వీ వాంట్ హమాలీ జాబ్’ అంటూ ట్విట్టర్ లో హోరెత్తిస్తున్నారు.
Must Read ;- బాబు అంటే.. టీఆర్ఎస్‌కు ఇంకా భయమే
We Want Hamali Job.@SingireddyTRS @TelanganaCMO @trspartyonline pic.twitter.com/2Gdu7K5JJY
— SHANKAR JANTHUKA (@SJanthuka) July 16, 2021











