మాస్ మహారాజా రవితేజ పోలీసాఫీసర్ గా నటిస్తోన్న సినిమా ‘క్రాక్’. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు ఇందులోని ఒక మాస్ ఐటెమ్ సాంగ్ షూట్ జరుగుతోంది . ఈ పాటలో రవితేజ తో పాటు ఆర్జీవీ సుందరి అప్సర రాణి నర్తిస్తోంది. అమ్మడి అందాలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
తమన్ సంగీతం , జానీ మాస్టర్ కొరియో గ్రఫీ అందిస్తోన్న ఈ పాట చిత్రీకరణ సందర్భంగా తీసిన ఓ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది చిత్ర బృందం. గోపీచంద్ మలినేని, రవితేజ , అప్సరరాణి తదితరులు ఇచ్చిన పోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్జీవి ‘థ్రిల్లర్, లెస్బియన్’ చిత్రాల్లో కథానాయికగా హాట్ గా మెరిసిన అప్సర రాణి .. ఇప్పుడు ‘క్రాక్’ సినిమాలో ఐటెమ్ గాళ్ గా నర్తించనుండడం ఆసక్తి రేపుతోంది. మరి ఆమె అందాలు ఏ రేంజ్ లో కనువిందు చేస్తాయో చూడాలి.
#KRACK mass item song loading 🔥🔥🔥🔥 #Apsara Rani pic.twitter.com/6ZBdXXMJTZ
— Gopichandh Malineni (@megopichand) October 16, 2020