అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మవవీగా రికార్డు సృష్టించిన పుష్ప బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.ఈ మూవీతో ఇప్పటికే అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోగా, ఆయన సరసన కథానాయికగా నటించిన రష్మికకి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో బన్నీ , సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప 2 పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకి సంబందించిన అనేక వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తొలత పుష్ప 2 ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుందని మొదట్లో వార్తలొచ్చినప్పటికీ.. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అంతకంటే ఒక నెల ముందుగానే.. అంటే జూలై నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది సుమమార్ బొనాంజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదేసమయంలో పుష్ప పార్ట్ 2 భారీ తారాగణంతో ఉండబోతోందని, ఈ నేపధ్యంలోనే పుష్ప కంటే భారీ బడ్జెట్ తో రూపొందబోతోందని, ఈ మూవీ 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఫస్ట్ పార్టులో ఎస్పీ గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ రెండో పార్ట్ లోనూ కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్ లో ఆయన పాత్ర కొంత సేపే ఉండగా..సెకండ్ పార్ట్ లో మాత్రం ఆయన పాత్ర హై లైట్ గా ఉండబోతోందని సమాచారం. ఇక మూవీలో మరో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరో స్టార్ హీరోను దింపుతున్నారట దర్శకుడు సుకుమార్. బాలీవుడ్ లో ఒకప్పుడు యాక్షన్ సినిమాలతో అలరించిన నటుడు సునీల్ శెట్టిని ఈ పాత్ర కోసం చూస్తున్నారని టాక్. ఈ పాత్రను సుకుమార్ డిఫరెంట్ గా డిజైన్ చేశారనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.
మరోవైపు ఈ పాత్రని విజయ్ సేతుపతి చేయబోతున్నాడానే ప్రచారం కూడా జోరందుకుంది. వాస్తవానికి మొదటి పార్ట్ లోనే విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయాల్సి ఉన్నప్పటికీ.. డేట్స్ ఖాళీ లేని కారణంగా ఆయన సినిమాకి దూరమయ్యారట. అయితే ఇప్పుడు మాత్రం మరో కీలక పాత్రలో ఈ స్టార్ కనిపించనున్నాడని ఇండస్ట్రి వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ ఈ సినిమాలో శ్రీవల్లీ పాత్రలో రష్మిక ఆకట్టుకుంది. ‘పుష్ప 2’ విషయానికి వచ్చేసరికి రష్మికతో పాటు మరో కథానాయికకు చోటు ఉందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఆ కథానాయిక ఎంపిక విషయంలోనే కసరత్తు జరుగుతోందట.
ఇదిలా ఉంటే మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ సరసన కథానాయికగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్ పార్ట్ లోనూ ఆమె ఉండబోతోందని దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. కాగా సెకండ్ పార్ట్ లో మాత్రం మరో హీరోయిన్ కూడా కనిపించబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో మరో హీరోయిన్ పాత్ర ఏ వైపు నుంచి ఉండనుందనే సందేహాలు అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.కాగా, పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన భన్వర్ సింగ్ షెకావత్ చెల్లెలు పాత్రలో మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒక వైపున ‘పుష్ప’ పై భన్వర్ సింగ్ కత్తులు నూరుతుంటే, మరో వైపున ఆయన చెల్లెలు పుష్ప పై మనసు పారేసుకుంటుందని అంటున్నారు. ఈ పాత్రను సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచాడని చెబుతున్నారు. అయితే ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.