సినిమా తారల కన్నా వారి వారసులకే ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వీరు ఎప్పిటికైనా హీరోలు అవుతారని అందరికీ గట్టి నమ్మకం. నేటి వారసులే రేపటి హీరోలు అనే సూత్రాన్ని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఇది ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి. బాలీవుడ్ స్టార్ పిల్లలకు ఇప్పటికే చాలామంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా షారూక్ ఖాన్ – గౌరీ ఖాన్ ల కుమారుడు అర్యన్ ఖాన్ నే తీసుకుంటే అతనికి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి సంగతి కూడా అంతే. అతను త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఇటీవల వీరిద్దరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ఓ చోట క్రికెట్ మ్యాచ్ ఆడి బయటికి వస్తుంటే ఫొటోలు తీశారు. ఇద్దరూ మాస్క్ లు పెట్టుకునే ఉన్నారు. ఇప్పటికే వీరి ఫొటోలు అనేక సార్లు బయటికి వచ్చాయి.అయినా అందులో సీక్రెట్ ఏముంటుంది. కాకపోతే హీరోగా రావడానికి కొన్ని రోజులు వెనకా ముందు.. అంతే. షారుక్ కుమారుడు కూడా త్వరలోనే హీరోగా రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది.

వీరిద్దరూ క్రికెట్ ఆడి బయటికి వచ్చేటప్పుడు గేటు బయట వీరి చుట్టూ జనం గుమికూడటం కూడా తరచూ జరుగుతుంటుంది. సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి ‘తడాప్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో అతనికి జంటగా తారా సుతారియా నటిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కే ఈ చిత్రాన్ని సాజిద్ నడియాద్ వాలా నిర్మిస్తున్నారు. మిలన్ లూద్రియా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.
తెలుగులో విజయవంతమైన ఆర్.ఎక్స్. 100 చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ 2019లోనే ప్రారంభమైంది. ఆర్యన్ ఖాన్ మాత్రం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి ఇప్పటికిప్పుడు రెడీగా లేడు. కాకపోతే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ యాక్టివ్ గా ఉన్నాడు. అలా అతని ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. హీరోలుగా వీరిని ప్రేక్షకులు చూసే రోజు మాత్రం ఎంతో దూరంలో లేదు.
Must Read ;- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులన్నా క్రేజే?











