ఫ్రీ పబ్లిసిటీ దొరికింది కదా అని ఇమేజ్ కి డామేజ్ చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో అషూ రెడ్డికి తెలియనట్టుంది. చనువిస్తే చంకనెక్కడం కొంతమందికి అలవాటు ఆ కోవలోకి ఈ భామ వస్తుంది. నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా అషూరెడ్డి గురించి అందరికీ తెలుసు. ఆమెను అశ్విని రెడ్డి అని కూడా పిలుస్తుంటారు. ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. కొందరు ఈ అభిమానాన్ని నటిస్తూ ఉంటారనుకోండి. అది నిజమైన అభిమానమో, బిస్కట్ వేయడంలో భాగంగా ఉండే అభిమానమో ఆ హీరోలకు ఏం తెలుస్తుంది. ఇటీవల ఆమె
ని షూటింగ్ భాగంలో కలిసింది. ఆయన అంటే ఎంతో అభిమానం అనడంతో మరీ దగ్గరైంది.
తన అభిమాన హీరో పవన్ తో కలిసి ఫొటో కూడా దిగింది. ఆ ఫొటోని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇంకనేం ఆమెకు ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. ఎంతో కాలం ఆయనను కలుసుకోవాలనుకున్నానని, తన దేవుడిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొంది. తన పేరుపై వేసుకున్న టాటూ కూడా తనకు గుర్తుందని పవన్ చెప్పారని పేర్కొంది. పైగా కాంట్రావర్శీ అయ్యాకే పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకున్నట్టు చెబుతోంది. అక్కడి నుంచి ఆమె తిరిగి వచ్చేటప్పుడు ఆయన స్వదస్తూరితో రాసిన ఓ లెటర్ కూడా ఇచ్చారట. తనకు ఇలాంటి అవకాశం కలిగించిన దర్శకుడు క్రిష్ కు కృతజ్ఞతలు కూడా తెలిపింది. పవన్ కళ్యాణ్ ఇచ్చిన లెటర్ ను కూడా పోస్టు చేసింది.
ఇంత హడావుడి చేస్తుంటే నెటిజన్లు ఎందుకు ఊరుకుంటారు ‘ఒక వేళ మీకు పవన్ కళ్యాణ్ కు నాలుగో భార్యగా ఉండటానికి అవకాశం వస్తే అంగీకరిస్తారా?’ అని ఓ నెటిజన్ అడిగేశాడు. దానికి ఆమెకు కోపం రాలేదు. అలాంటి అవకాశం వస్తే ఒప్పుకుంటానంటూ సమాధానం ఇచ్చింది. నెట్టింట వైరల్ కావాలంటే ఇంతకంటే మంచి అవకాశం ఎవరికీ రాదు. కాకపోతే పవన్ కళ్యాణ్ కు ఇంతకుముందు మూడు పెళ్లిళ్లు అయ్యాయనే విషయాన్ని పదే పదే చెప్పాల్సి అవకాశం ఉందా అన్నదే ప్రశ్న. అభిమానం ముదిరి పాకాన పడితే ఇలాంటి వైపరీత్యాలే జరుగుతాయి. పవన్ కు ఆమె మేలు చేస్తోందో కీడు చేస్తోందో అర్థం కావడం లేదు.
Also Read : వచ్చే సంక్రాంతికి మహేశ్ – పవన్ వార్