రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చర్యలు ప్రారంభించింది. నిమ్మగడ్డపై మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇచ్చిన ప్రజాప్రతినిధుల హక్కుల ఉల్లంఘన నోటీసును అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ప్రివిలేజ్ కమిటీకీ ఇప్పటికే పంపించారు. గవర్నర్ విశ్వభూషన్‌కు నిమ్మగడ్డ ఇచ్చిన ఫిర్యాదులో తమను కించపరిచేలా, తమ ప్రతిష్ట దిగజార్చేలా పేర్కొన్నారని, ఫిర్యాదులోని అంశాలపై మీడియా తమ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రసారం చేశాయని స్పీకర్‌కు మంత్రులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాకాణి గోవర్థన్ రెడ్డి అధ్వర్యంలోని ప్రివిలేజ్ కమిటీ దృష్టి సారించింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశాలు జరపనున్నారు. మంత్రుల ఫిర్యాదులపై నిమ్మగడ్డను వివరణ అడిగే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే ఒకసారి కాకాణి గోవర్థన్ రెడ్డి ఛైర్మన్‌గా ఉన్న ప్రివిలేజ్ కమిటీ సమావేశం అయింది. మంత్రులు ఇచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ ఇప్పటికే చర్చించింది. శాసనసభలోని రూల్ నెం 212, 213 కింద ఎస్‌ఈసీని పిలిపించవచ్చని సభ్యులు కమిటీకి తెలిపారు. గతంలో మహారాష్ట్రలో ఇలా పిలిపించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం ఎస్‌ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయని, అలాంటప్పుడు నిమ్మగడ్డను ఎలా పిలుస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.
Must Read ;- నాడు తిట్టినోళ్లే నేడు పొగడ్తలు.. వైసీపీకి ఇప్పుడు నిమ్మగడ్డ తియ్యగా..!