స్పిన్‌కు స్వర్గధామమైన పిచ్‌పై రవిచంద్రన్ అశ్విన్ చెలరేగారు.148 బంతుల్లో 106 పరుగులు సాధించి.. అందరినీ ఆశ్చర్య పరిచారు. అద్భుత శతకంతో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపించారు. ఫలితంగా.. వరుసగా మూడో రోజు సైతం భారత్‌దే ఆధిపత్యమైంది.
భారత్ విజయం.. సునాయాసం
చెపాక్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. 482 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు సోమవారం ఆట ఆఖరుకు మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా లోకల్ బాయ్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. క్రీజులో రూట్ (2), లారెన్స్ (19) ఉన్నారు.
సెంచరీ హీరోపై ప్రశంసల వర్షం..
సెంచరీ హీరో, టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్యాట్స్‌మెన్‌కు అనుకూలం కాదన్న పిచ్‌పై అశ్ చెలరేగి ఆడుతూ బౌండరీలు బాదిన తీరును దిగ్గజ ఆటగాళ్లు కొనియాడుతున్నారు. ఏడోస్థానంలో బ్యాటింగ్‌కు దిగి శతకం సాధించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో సొంత మైదానంలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో మ్యాజిక్ చేసి భారత్ 286 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ కోహ్లి(62 పరుగులు) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయిన తరుణంలో అశ్విన్ విశ్వరూపం ప్రదర్శించారు.
ఇంగ్లాండ్ విలవిల..
భారీ ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌కు అక్షర్ పటేల్ ఆదిలోనే షాకిచ్చారు. ఓపెనర్ సిబ్లీ(2)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నారు. తర్వాత క్రీజులోకి వచ్చిన లారెన్స్‌తో కలిసి బర్న్స్ (25; 42 బంతుల్లో, 4×4) ఇన్నింగ్స్ చక్కదిద్దాడినికి ప్రయత్నించారు. కానీ అశ్విన్ వేసిన చక్కని బంతికి అతడు కోహ్లీ చేతికి చిక్కారు. అనంతరం నైట్ వాచ్‌మన్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన లీచ్ (0)ను అక్షర్ బోల్తా కొట్టించి ప్రత్యర్థి జట్టును మరోసారి దెబ్బతీశారు. అయితే రూట్, లారెన్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మూడో రోజు ఆటను ముగించారు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే మరో 429 పరుగులు సాధించాలి. కానీ స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై మరో రెండు రోజులు భారత బౌలర్లను కాచుకుని లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే!
Must Read ;- భారత్ - ఇంగ్లండ్ టెస్టు.. చపాక్‌లో ఆ త్రిశతకాలు గుర్తున్నాయా?