జీవితం మొత్తం రివర్స్ గేరేనా?
జగన్ రెడ్డి పాలన అంతా రివర్స్ అని తొలినాళ్లల్లోనే ఆయనే ఒప్పుకున్నారు. సంస్కరణలు పేరుతో పథకాల్లో రివర్స్ పాలనకు శ్రీకారం చుట్టారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఎంత మేరకు ప్రయోజనం చేకూరిందో తెలియదుకానీ.. పబ్లిక్ జేబుకు చిల్లుమాత్రం ఒక రేంజ్ లో పడింది. ఏపీలో అన్నింట ధరలు ఆకాశానికి అంటాయి! చివరికి పేదవాడికి కంటిమీద కునుకు లేకుండా చేసింది! గత ఏడాదే ఏపీలో బతకలేం అని డిసైడ్ అయ్యి .. వేలాది కుటుంబాలు సరిహద్దు రాష్ట్రాలైనా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు లకు వలస వెళ్లారు. పంటలు సరిగా పండక, పండినవాటికి గిట్టుబాటు ధర లేక గ్రామాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. అటువంటి వాటిపై జగన్ ఏనాడు దృష్టిసారించి, వాటిపై చర్యలు తీసుకున్న దాఖాలాలు లేవు. కానీ నేడు వినోదాన్ని ఉద్దరించేందుకు ఆయన చేసిన ఘనకార్యం పేదవాడు పెదవి విరుస్తుంటే.. సినీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. పేదలు అధికంగా వెళ్లే నేల టికెట్ల ధరను భారీగా పెంచి, ధనికులు వెళ్లే బాల్కనీ టికెట్ల రేట్లను మాత్రం తగ్గించింది. పేదోడికి సినిమా టికెట్ భారంగా ఉందని నీతి మంత్రాలు వల్లించి.. నేడు మీరు చేసిందేమిటి? గ్రామీణంలో నేల టికెట్ ధర రూ. 20 ఉంటే కొత్త ధరలు ప్రకారం రూ. 40 చేశారు. అదే పట్టణాల్లో రూ. 50 ఉన్నది రూ.70కి పెంచారు. దీంతో ప్రత్యక్షంగా పేద, మధ్య తరగతి ప్రేక్షకుడికి భారం పడుతోంది. ఎగువ తరగతి వారికి భారం తగ్గించి, ఆ నష్టాన్ని పేదవాడిపైనే వేశారు. అందుకే జగన్ పాలనలో రివర్స్ తప్ప సవ్యదిశలో పాలన అనేది చూడలేం అని ఏపీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు!
‘భీమ్లా నాయక్’కు భయపడేనా?
పవర్ స్టార్, జనసేనాని పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ పై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఆర్థికంగా, రాజకీయంగా పవన్ ను దెబ్బకొట్టాలని చూశారు. కానీ ‘భీమ్లా నాయక్’ తో పవన్ తన ఇమేజ్ ను పొలిటికల్ సర్కిల్స్ లో అమాంతం పెంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏదో చేయాలని భావించి టికెట్ ధరలపై ఉన్న జీవో ఎత్తివేయకుండా ఆంక్షాలు కొనసాగిస్తే.. పవన్ అభిమానులు రాజకీయాలకు అతీతంగా స్పందించారు. అభిమానం వేరు, రాజకీయాలు వేరు అన్న రీతిగా సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వానికి కౌంటర్స్ ఇచ్చారు. దీంతో వారం రోజులు సోషల్ మీడియాలో అభిమానులంతా జగన్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఎన్ని ఆంక్షాలు పెట్టినా.. ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ మాత్రం ఆగలేదు. ఇంకా పవన్ క్రేజ్ సిని పరిశ్రమలోనే కాదు.. రాజకీయ వర్గాల్లో అమాంతం పెరిగింది. పవన్ కు భయపడే ఆనాడు కమిటీ రిపోర్టును సాకుగా చూపి.. జిల్లా కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారుల వరకు థియేటర్లపై దాడులు చేసి.. టికెట్ ధరల నియంత్రణపై ఫోకస్ చేశారు. మరి ఇప్పడేమో .. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఆర్ఆర్ఆర్, సర్కార్ వారి పాట, రాధేశ్యామ్, ఆచార్య’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు జీవో విడుదల చేసి.. టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది. మరి దీనిని ఏమంటారో అధికారపార్టీ నేతలు, మంత్రులే పవన్ అభిమానులకు సమాధానం చెప్పాలి!
Must Read :-జగన్ ప్రభుత్వానికి టీచర్స్ జేఏసీ స్ట్రాంగ్ వార్నింగ్! 75 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఓడిస్తాం!