బుల్లితెరపై ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో ఆకట్టుకున్న అవికా గోర్ ను, హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ ఆదరించింది. ఆకర్షణీయమైన కళ్లు .. ఆ రెండింటినీ కలిపే ఇంద్రధనుస్సు వంటి కనుబొమలు ఈ అమ్మాయికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దాంతో టీనేజ్ లవ్ స్టోరీస్ ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చాయి. అప్పటికే అమ్మాయికి యాక్టింగ్ కొట్టినపిండి కావడంతో ప్రేక్షకులను ఒక రేంజ్ లో మెప్పించింది. చేసిన సినిమాలు వరుసగా హిట్ కావడంతో, అంతా ఈ అమ్మాయి గురించే మాట్లాడుకున్నారు. కుర్ర హీరోలకు మంచి హీరోయిన్ దొరికిందని అంతా అనుకున్నారు.

కానీ ఎందుకో ఈ అమ్మాయి తెలుగు సినిమాలపై అంతగా దృష్టి పెట్టలేదు. అలా అని చెప్పేసి వేరే భాషల్లో బిజీ కాలేదు. మధ్యలో చుట్టపు చూపుగా వచ్చి తెలుగులో ‘రాజుగారి గది 3’ చేసింది గానీ, అది ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేదు. ఆ తరువాత ఈ పిల్ల అడ్రెస్ లేదు. ఇక తాను స్కిన్ షో చేయడానికి కూడా సిద్ధమే అన్నట్టుగా అప్పుడప్పుడూ హాట్ పిక్స్ వదుళుతూ వెళుతోంది. ఈ అమ్మాయిని అలా చూడటానికి ఆడియన్స్ ఇష్టపడతారా? అనే డౌట్ దర్శక నిర్మాతలకు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో ఈ పిల్ల చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ జోడీగా ఒక సినిమా చేయనుంది. వాళ్లో వీళ్లో చెబితే ఈ విషయంలో మనకి డౌట్ ఉండేదేమోగానీ, ఈ పిల్లే ఇన్ స్టా లో ఈ విషయాన్ని చెప్పేసింది గనుక ఎలాంటి సందేహం లేదు. రచయిత శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా ఈ అమ్మాయిని ఎంపిక చేశారు. రీసెంట్ గా ఈ సినిమా షూటింగు మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీవారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనైనా అవికా ఇక్కడ నిలదొక్కుకుంటుందో, లేదంటే ఇంతకుముందు మాదిరిగానే చేస్తుందో చూడాలి.











