Bala Krishna Next Movie With Sriwass :
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభించి.. పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ మూవీ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత బాలయ్య.. శ్రీవాస్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో డిక్టేటర్ మూవీ వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సస్ సాధించింది. ఈ కాంబినేషన్ లో మూవీని సి.కళ్యాణ్ నిర్మించనున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ స్టోరీ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఓ చిన్న ఊరు నుంచి గూగుల్ లాంటి కంపెనీకి సీఈవోగా ఎదిగిన ఓ వ్యక్తి కథ ఇది. మళ్లీ తన ఊరికి, తన దేశానికి… తను సంపాదించిన జ్ఞానాన్నీ, సంపాదననీ పంచివ్వాలనుకుంటాడు. ఇలా చేయాలనుకున్నప్పుడు వచ్చిన సమస్యలు ఏంటి..? ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు అనేది ఈ కథ అని సమాచారం.
ప్రచారంలో ఉన్న ఈ స్టోరీ వింటుంటే.. మహేష్ బాబు శ్రీమంతుడు, మహర్షి సినిమాలు గుర్తొస్తున్నాయి. ఆ సినిమాల ఫ్లేవర్ లో స్టోరీ ఉన్నప్పటికీ.. ఆ సినిమాలకు ఈ కథకు చాలా తేడీ ఉంటుందట. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు కరెక్ట్ గా సెట్ అవుతుందని.. శ్రీవాస్ గట్టి నమ్మకంతో ఉన్నారని తెలిసింది. మరి.. డిక్టేటర్ కు మించిన విజయాన్ని బాలయ్యతో శ్రీవాస్ ఈ సినిమాతో సాధిస్తారేమో చూడాలి.
Must Read ;- షాకింగ్ ధరకు.. బాలయ్య ‘అఖండ’ హిందీ డబ్బింగ్ రైట్స్