నందమూరి నటసింహం బాలకృష్ణ తో దిల్ రాజు ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు. అలాగే సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకుంటున్నారు. బాలయ్య కోసం రామారావు గారు అనే టైటిల్ తో ఓ స్టోరీ రెడీ చేశారు. బాలయ్యకు కూడా అనిల్ కథ చెప్పారని.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయం అనుకున్నారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ సినిమా వార్తలకే పరిమితం అయ్యింది. ఇప్పుడు మళ్లీ బాలయ్య, అనిల్ రావిపూడి కాంబో మూవీ వార్తల్లోకి వచ్చింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నారు. వెంకీ, వరుణ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వచ్చే సమ్మర్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ తో మరో సినిమా చేయాలి. మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు. ‘ఎఫ్ 3’ సినిమా సమ్మర్ కి షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత వెంటనే మహేష్ తో సినిమా చేయడానికి ‘సర్కారు వారి పాట’ ఇంకా పూర్తవ్వదు.
అందుకే మహేష్ సినిమా పూర్తి చేసే లోపు అనిల్ తో మరో సినిమా చేయా లనుకుంటున్నారట దిల్ రాజు. ఆ సినిమా ఎవరితోనో కాదు బాలయ్యతో అయితే బాగుంటుంది అనుకుంటున్నారట. బాలయ్య బోయపాటితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పటికి పూర్తవుతుందో ఇంకా క్లారిటీ లేదు. అంతా సెట్ అయితే.. బాలయ్య, అనిల్ రావిపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో మూవీ సెట్ కావచ్చు. మరి.. ఏం జరగనుందో చూడాలి.
Must Read ;- బోయపాటి మూవీలో బాలయ్య రోల్ ఇదేనా.?