నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా మధ్యలోనే నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ఈమధ్యనే ప్రారంభం అయ్యింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ ను పెట్టలేదు దర్శకుడు బోయపాటి. బాలయ్య బాబు సినిమాకు ఒక పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టాలని ఎప్పటి నుండో ఆలోచిస్తున్నాడు బోయపాటి. ఆమధ్య కాలంలో ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ ను పెట్టనున్నారనే వార్తలు వచ్చాయి. కాని చిత్ర బృందం ఈ టైటిల్ పై స్పందించలేదు.
మరికొన్ని రోజుల తర్వాత ‘డేంజర్’, టార్చ్ బేరర్’ అనే టైటిల్స్ పెట్టబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవి కూడా రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా టైటిల్ పై టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. అందుకే ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ అదిరిపోతుందని బోయపాటి భావిస్తున్నాడట బాలకృష్ణ లాంటి పవర్ ఫుల్ హీరోకి ఇలాంటి పవర్ ఫుల్ టైటిల్స్ నే పెట్టాలని దర్శకుడు ఆలోచన చేస్తున్నాడని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన టైటిల్ ను త్వరలోనే రిలీజ్ చేస్తారని సమాచారం.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణపై రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది కూడా. అందులో బాలయ్య పవర్ ఫుల్ గా, పక్కా మాస్ గా కనిపిస్తున్నాడు. టీజర్ ను బట్టి చుస్తే ఈ సినిమాకు ‘మోనార్క్’ అనే టైటిల్ ను పెట్టడం సరైన నిర్ణయమని అభిమానులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ సినిమా టైటిల్ పై సస్పెన్స్ వీడాలంటే ఇంకొన్ని రోజులు అభిమానులు ఆగాల్సిందే.
Must Read ;- బాలకృష్ణ కొట్టారు అన్న కామెంట్స్ పై &సెహరీ హీరో వివరణ