Balakrishna Upcoming Movies :
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసేందుకు బాలయ్య రెడీ అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు లైన్ లో ఉండడం విశేషం.
‘అఖండ’ సినిమా తర్వాత బాలయ్య క్రాక్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. అలాగే దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా, సి. కళ్యాణ్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నారని సమాచారం. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు బాలయ్యకు భారీ అడ్వాన్స్ లు ఇచ్చాయి.
రాజ్ కందుకూరి సైతం బాలయ్యతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఆయన బాలయ్యని కలిసినట్లు తెలిసింది. అయితే.. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా బాలయ్యతో ఓ సినిమా చేయాలనుకుంటోంది. ఇవి కాకుండా మరికొందరు నిర్మాతలు బాలయ్య డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలను కంప్లీట్ చేయడానికే మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకనే.. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేసేందుకు కాంటాక్ట్ చేస్తున్న వాళ్లకు మూడేళ్ల వరకు డేట్స్ లేవని చెబుతన్నారట. యంగ్ హీరోలకు దీటుగా బాలయ్య దూసుకెళుతుండడం విశేషం.
Must Read ;- బాలయ్య – శ్రీవాస్ మూవీ స్టోరీ ఇదేనా.?