నందమూరి నటసింహం బాలకృష్ణ – ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘అఖండ’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత విడుదల ఎప్పుడు అనేది ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే.. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమా గురించి అధికారికంగా అనౌన్స్ చేస్తారనుకున్నారు.
అయితే.. క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమాని ప్రకటించారు కానీ.. అనిల్ రావిపూడితో బాలయ్య సినిమాని ప్రకటించలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా.? లేదా.? అనే అనుమానాలు మొదలయ్యాయి. పటాస్ సినిమా దగ్గర నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు అపజయం అనేది తెలియకుండా వరుసగా
సక్సెస్ సాధిస్తూ సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది బాలయ్య పుట్టినరోజున ఈ సినిమా గురించి అప్ డేట్ రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ లేదేమో అని అభిమానులు ఫీలయ్యారు.
అయితే.. బాలయ్య పుట్టినరోజున కొందరు అభిమానులతో జూమ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. బాలయ్యను అనిల్ రావిపూడితో సినిమా గురించి అడిగాడు. దీనికి బాలయ్య బదులిస్తూ… అనిల్ రావిపూడితో సినిమా ఖచ్చితంగా ఉంటుందని, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సో.. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్ ఫిక్స్. అందులో ఎలాంటి సందేహం లేదు.
Must Read ;- ‘అఖండ’ తేజోవంతం ఈ ‘నందమూరి’ నట తారకం