నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా వస్తోంది అంటే ఆయన అభిమానులు పండగ వస్తున్నట్లే ఫీల్ అవుతారు. ఇక ఆ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్తా వచ్చినా అది సెన్సేషన్ అవ్వడం ఖాయం.ప్రస్తుతం అటువంటి ఘటనే మరొకటి ఉత్పన్నమయ్యింది. బాలకృష్ణ హీరోగా దర్శకుడు మలినేని గోపీచంద్ ఒక చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షనిజం చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా , ఈ మూవీ బాలయ్య కెరీర్ లో 107వ చిత్రం కావడం విశేషం.మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇప్పటి వరకు టైటిల్ ని ఖరారు చేయలేదు.
గత కొద్ది కాలంగా ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది.. ఈ క్రమంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు హంట్ పేరుతో టీజర్ ను చిత్ర యూనిట్ సభ్యులు రిలీజ్ చేశారు. టీజర్ ఇలా వదిలీ వదలగానే అలా దూసుకుపోతోంది. టీజర్ విడుదల అయిన ఒక్క రోజులోనే కోటికి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం ఈ టీజర్ యూ ట్యూబ్ లో నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది.
మూవీలో బాలయ్య లుక్ మంచి మార్కులు కొట్టేయగా.. లుక్ కి తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్, ఆపై భారీ యాక్షన్ సీన్స్ తో కట్ చేసిన ఈ టీజర్ చాలామందికి వెంటనే కనెక్ట్ అయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా అలరించబోతోంది. ఇక ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరి టీజర్ కే ఇటువంటి రెస్పాన్స్ వస్తుంటే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అనే ప్రశ్నలు బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేస్తున్నాయి.