రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్ ఇచ్చిన ట్రీట్ కు ప్రభాస్ అభిమానులు ఫిదా అయ్యారు. అదే బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్. ఇంతకీ ఇందులో ఏమిటి ఆ ప్రత్యేకత అన్నది చూడాల్సిందే.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాత్రలను రివీల్ చేశారు. ఒకటి ప్రేరణ, ఇంకోటి విక్రమాదిత్య. రాధేశ్యామ్ లోని ప్రభాస్ పాత్ర పేరు విక్రమాదిత్య. ఇప్పటిదాకా ఈ సినిమాలోని రెండు పాత్రల మీద స్పష్టత వచ్చేసింది. ఇక రావలసిందల్లా ‘రాధేశ్యామ్’ ఎవరు అన్నదే. ఒకరు రాధ, ఇంకొకరు శ్యామ్ అని కూడా కొందరు అనుకుంటున్నారు. ఇది పూర్వజన్మ కథాంశం కాబట్టి గత జన్మల్లోని పాత్రలుగా రాధ, శ్యామ్ కనిపిస్తారా? విక్రమాదిత్య, ప్రేరణ కనిపిస్తారా అన్నది మాత్రం సస్పన్సే. ఈరోజు విడుదలైన మోషన్ పోస్టర్ ద్వారా కూడా దీనిపై స్పష్టత రాలేదు.
బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మీద అందరికీ ఉత్కంఠ నెలకొంది.
బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ నిడివి కాస్త ఎక్కువే. రొమాంటిక్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. (also read: ప్రేరణగా పూజ, విక్రమాదిత్యగా ప్రభాస్.. శభాష్ రాధేశ్యామ్ ). ఈరోజు విడుదలయ్యే టీజర్ లో ప్రేరణ, విక్రమాదిత్యల రైలు పరిచయం కూడా ఉంది. మొదట అరచేతిని చూపించారు. అందులో నుంచి కథని కొద్దిగా రివీల్ చేశారు. దూరంగా కొండలు, అక్కడి నుంచి పొగలు కక్కుతూ వచ్చే రైలు, అందులో నుంచి ఎగురుతున్న చున్నీ, దాన్ని ఓ చేయి పట్టుకోవడం, ఆ తర్వాత హీరోయిన్ రైలు డోర్ నుంచి వేలాడుతూ కనిపిస్తారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో ఉండే ప్రత్యేకత ఎలాంటిదో కూడా ఈ మోషన్ పోస్టర్ చూస్తే తెలిసింది.

యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది మాత్రమే ఈ సినిమా విడుదలవుతుంది. నటుడు కృష్ణంరాజు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలు. జార్జియాలో రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిించారు. కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ను నిలిపివేశారు. ఆ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇటలీలో చిత్రీకరణ ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో షూటింగ్లకు అనుమతులు లభించినప్పటికీ విదేశాలకు వెళ్లడానికి ప్రభాస్ ధైర్యంగా ముందుకొచ్చారు.











