ఏపీలో ఇండస్ట్రీయల్ సెక్టార్ దూసుకుపోతోంది. తాజాగా మరో భారీ ప్రాజెక్టు ఏపీకి వచ్చింది. రాష్ట్రంలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL భారీ పెట్టుబడితో ముందుకు వచ్చింది. రాయలసీమలో ప్రపంచ స్థాయి రక్షణ రంగానికి సంబంధించిన హబ్‌ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది.
ఈ ప్రాజెక్ట్ కోసం శ్రీసత్యసాయి జిల్లాలో ఏకంగా 914 ఎకరాల విశాలమైన భూమిని కేటాయించారు. దాదాపు రూ. 2,500 కోట్ల భారీ పెట్టుబడితో అత్యాధునిక రక్షణ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఏకంగా 800 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా, ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆ ప్రాంతంలో అనేక చిన్న, మధ్యతరహా సరఫరా పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందనున్నాయి.
చెప్పినట్లుగానే చేసి చూపించాం – We said it, and we did it అంటూ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్ విశేషాలను సోషల్ మీడియా వేదికగా గర్వంగా పంచుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకువస్తూ, యువతకు బంగారు భవిష్యత్తును కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మరోసారి నిరూపించారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో.. శ్రీసత్యసాయి జిల్లాలోని ‘భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) అద్భుతమైన ప్రధాన ప్రవేశ ద్వారం, నిర్మాణంలో ఉన్న భారీ ప్లాంట్లు, సబ్-స్టేషన్లు, విస్తృతమైన రోడ్లు మరియు జరుగుతున్న పనులను డ్రోన్ విజువల్స్ ద్వారా కళ్లకు కట్టారు. రూ. 2500 కోట్ల భారీ పెట్టుబడి మరియు 800 ఉద్యోగాల లక్ష్యంతో సాగుతున్న ఈ మహా ప్రాజెక్ట్ పనుల తీరు వీడియోలో చాలా స్పష్టంగా వివరించారు.











