దేశ చరిత్రలో ఎక్కడలేని వింత పాలన..!
రాజకీయ పార్టీకి ఓటు వేయకుంటే.. ప్రభుత్వ ఇచ్చే పింఛన్లను తొలగించడం ఒక విడ్డూరం! అయితే జగన్ రెడ్డి ఏలుబడిలో ఉన్న ఏపీలో ఆయన పార్టీకి ఓటు వేయకుంటే.. రేషన్ కార్డులు, పింఛన్లు ఇట్టే తీసివేస్తుంటారు. ఒక్కొక్కసారి శాడిజం పీక్ కు చేరి.. వింత చేష్టలకు తెరతీస్తుంటారు. గుంటూరు జిల్లా ఈ మధ్య జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని కొంతమంది పింఛన్లను వేర్వేరు జిల్లాలకు బదీలి చేసి కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యపురం మండలం వయ్యకల్లు గ్రామానికి చెందన కొణిదేన ఏడుకొండలు, ఆలూరి వెంకట్రావు, గొనుగుంట్ల చిన వెంకటేశ్వర్లు, కర్రి ఈశ్వరవాణి లు వారి పింఛన్లను వేరే జిల్లాలకు బదిలీ చేశారని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ కు స్పందన లో ఫిర్యాదు చేశారు. డిసెంబర్ నెల నుంచి తమకు పింఛన్ల రావడం లేదని.. స్థానిక సచివాలయంలో అడిగితే.. మీ పింఛన్లు ఇతర జిల్లాల సచివాలయాల్లో నమోదైనట్లు చెప్పారని బాధితులు వాపోయ్యారు. గుంటూరు జిల్లాలోని ఎక్కడో మారుమూల ప్రాంతమైన శావల్యపురం మండలంలోని సామాజిక పింఛన్లను తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలోని హంసవరం, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల, నందిగామ మండలం గోళ్లమూడి వంటి ఏరియాలకు బదిలీ చేశారు. దీంతో వయసుడికి పోయిన రోజుల్లో పక్కజిల్లాకు వెళ్లి పింఛన్లను తీసుకోవాల్సిన పరిస్థితి పట్టించారని బాధితులు వాపోతున్నారు.
హింసించడంలో ఇదొక కొత్తరకం స్టైల్..!
జగన్ రెడ్డి పాలనలో సరికొత్త వింత రాజకీయాల రాష్ట్రంలో చూడాల్సి వస్తోంది! ఆయన పార్టీకి ఎవరైన ఓటు వేయలేదని తెలిస్తే.. వారికి ప్రభుత్వం నుంచి అందే ఏ సంక్షేమ పథకమైన నిలిచిపోతాయి! ఓటు వేయని ఓటరును గుర్తించి.. వారిని చిత్రహింసలకు గురిచేస్తుంటారు. గ్రామీణ స్థాయిలో పింఛన్ల దారులపై ఒత్తిడి ఇంకా అధికంగా ఉంది. వేరే జిల్లాలకు పింఛన్ల ను బదిలీ చేయడం కారణంగా… రెండు నెలల పాటు పింఛన్ తీసుకొకుంటే ఇక వారికి పింఛన్ రాదు. నేరుగా పింఛన్ తొలిగిస్తే.. నిందలు మోయాల్సి వస్తోందని.. తెలివిగా పింఛన్లను వేరే జిల్లాలకు మార్చుతున్నారు. దీంతో సుమారు 500 కిలో మీటర్లు దూరంలో ఉన్న జిల్లాలకు బదిలీ చేస్తే అక్కడకు వెళ్లి ఎలగైనా పింఛన్ తీసుకోలేరు.. తదనంతరం యథేచ్ఛగా ఓటు వేయని, వివిధ పార్టీలో కొనసాగుతున్న వారి పింఛన్లు తొలగించవచ్చనే నీచపు కుట్రలతో అధికారపార్టీ తెరతీస్తోందని బాధిత కుటుంబాలు ఆరోపింస్తున్నాయి.











