ముఖ్యమంత్రికి సొంత చెల్లెలు అని కూడా చూడకుండా వైఎస్ షర్మిలను వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా మాఫియా ఏ స్థాయిలో కించపరుస్తుందో తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల తన పని తాను చేసుకుంటుంటే.. జగన్ ఓర్వలేకపోతున్నారు. తాను నేరుగా స్పందించకుండా తన పార్టీ సోషల్ మీడియాను ఉసిగొల్పుతున్నారు. ఇన్ని రోజులు ఓ స్థాయిలోనే జరిగిన వైసీపీ సోషల్ మీడియా అరాచకం.. ఇక మరో అడుగు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వినలేని, చెప్పలేని తరహాలో షర్మిలను, పరోక్షంగా ఆమె తల్లి విజయమ్మను కించపరిచారు. వైసీపీ సోషల్ మీడియానే దిగజారి పోయి మరీ.. వైఎస్ కు షర్మిల పుట్టలేదంటూ సోషల్ మీడియాలో దాడికి దిగింది. ఇప్పుడు షర్మిలను మరింత దిగజార్చేలా ఆమెపై దాడిని తీవ్రతరం చేయబోతున్నట్లుగా వ్యూహం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇందుకోసం వైఎస్ జగన్ భారతి, వైసీపీ సోషల్ మీడియా విభాగం హెడ్ సజ్జల భార్గవ్ రెడ్డి స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కనీసం మహిళ అన్న ఆలోచన కూడా లేకుండా వైసీపీ సోషల్ మీడియా ఆమెపై తెగబడింది. ఇకపై మరింత డోసు పెంచేలా తన సోషల్ మీడియా విభాగానికి తాడేపల్లి ప్యాలెస్ లోనే శిక్షణ ఇస్తున్నారని తెలిసింది. షర్మిలను ‘చంద్రముఖి’గా అభివర్ణిస్తూ మరింత దారుణమైన తరహాలో అవమానపరిచేలా సోషల్ దాడి చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే షర్మిల కులం రెడ్డి కాదని.. ఆమె బ్రాహ్మణ కులానికి చెందివారంటూ విమర్శలు చేశారు. అసభ్య పోస్టులు పెట్టించారు. ఆమె బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ను పెళ్లి చేసుకున్నందున.. ఆమె వైఎస్ షర్మిలా రెడ్డి కాదు.. మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అంటూ విమర్శలు చేశారు.
ఒక దశలో ఆమె రాజశేఖర్ రెడ్డికే పుట్టిందా అని దారుణమైన కామెంట్లతో తల్లి విజయలక్ష్మి కుంగిపోయేలాగా వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. ఇక తాజాగా మొదలుకాబోయే సోషల్ మీడియా దాడికి ముగ్గురు ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. జగన్ సతీమణి భారతీ రెడ్డి డైరెక్షన్లో ఈ వికృత ఆలోచనను త్వరలోనే అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. అటు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి ద్వారా విపరీతమైన ఆరోపణలు షర్మిలపై రూపొందించి.. తమ సోషల్ మీడియాలో వదలనున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ షర్మిల ఇప్పటికే తన అన్న అయిన ముఖ్యమంత్రి జగన్ పైన విపరీతంగా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విభజన హామీలు, సీపీఎస్ రద్దు, మద్య నిషేధం, భూముల కబ్జాలు, బాదుడే బాదుడు లాంటి అంశాలను షర్మిల దీటుగా, ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రతిపక్షాలే ఈ విమర్శలు చేసినా అంతగా పట్టించుకోని అధికార పార్టీ అధినేత.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షురాలి హోదాలో సొంత చెల్లెలు షర్మిల ఇలా చేస్తుండడాన్ని సహించలేకపోతున్నారు. అందుకే ఆమెను మానసికంగా దెబ్బకొట్టేందుకు రాక్షసంగా సోషల్ మీడియా దాడి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.