Bheemla Nayak Directly Releasing on OTT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – పవర్ హౌస్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై రోజురోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. సంక్రాంతికి భీమ్లా నాయక్ వస్తుందని ప్రకటించడంతో ఎప్పుడెప్పుడు భీమ్లా నాయక్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు కానీ.. అనుకోకుండా సంక్రాంతి బరిలోకి ఆర్ఆర్ఆర్ వచ్చింది. దీంతో భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.
Bheemla Nayak Directly Releasing on OTT
మరో వార్త ఏంటంటే.. భీమ్లా నాయక్ ఓటీటీలో రాబోతుందని. దీంతో ఇది నిజమేనా..? కాదా..? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చిందట. ఈ ఆఫర్ గురించి నిర్మాణ సంస్థ సీరియస్ గా ఆలోచిస్తుందని.. భీమ్లా నాయక్ ఓటీటీలో రానుందని వార్తలు వచ్చాయి. గతంలో ఇలా వార్తలు వచ్చినప్పుడు నిర్మాత ఆ వార్తలను ఖండించారు. ఇప్పుడు మళ్లీ భీమ్లా నాయక్ ఓటీటీలో రాబోతుందని ప్రచారం ఊపందుకుంది. అందుకనే మరోసారి ఈ వార్తలను నిర్మాత సూర్యదేవర నాగవంశీ సోషల్ మీడియా ద్వారా ఖండించారు.
భీమ్లా నాయక్ ఓటీటీలో రావడం లేదు. థియేటర్లోనే వస్తుంది అంటున్నారు. అలాగే.. సంక్రాంతికి రావడం లేదు అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. చెప్పినట్టుగా సంక్రాంతికి భీమ్లా నాయక్ వస్తుంది అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అన్నారు చిత్ర నిర్మాత.