పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ భీమ్లా నాయక్. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి తెలుగు రీమేక్ ఇది. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈమధ్య రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ టీజర్ రిలీజ్ చేయడం.. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడం.. తెలిసిందే.
ఈ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. ఈ టీజర్ ఇంతలా ఆకట్టుకోవడానికి దీనికి తమన్ అందించిన సంగీతం కూడా ఓ కారణం అని చెప్పచ్చు. ఎప్పుడైతే టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా పై క్రేజ్ ఓ రేంజ్ లో ఏర్పడిందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2 పవర్ స్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. దీనికి ముహుర్తం ఫిక్స్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటల 16 నిమిషాలకు టైటిల్ ట్రాక్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సాంగ్ వింటే… పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే.. అన్నట్టుగా ఈ పాట ఉంటుందని సమాచారం. మరి.. ఈ సాంగ్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన సమంత