పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు భీమ్లా నాయక్ విడుదల అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
అయితే.. ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో ప్రకటించారు. అయినప్పటికీ.. భీమ్లా నాయక్ సంక్రాంతికి రావడం లేదు. సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ఇలా ప్రచారం జరుగుతుండడంతో అసలు భీమ్లా నాయక్ సంక్రాంతికి వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనేది సస్పెన్స్ గా మారింది. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సంక్రాంతికి వస్తున్నాయి. భీమ్లా నాయక్ వస్తే.. ఆ రెండు సినిమాలకు భారీగా నష్టం వస్తుంది. అందుకనే భీమ్లా నాయక్ విడుదల ఆపాలని ఇండస్ట్రీ ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
పవన్ మాత్రం సంక్రాంతికి వస్తుందని ప్రకటించి ఇప్పుడు ఆగితే ఎలా అని నిర్మాతకు కాస్త గట్టిగానే చెప్పడంతో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఎట్టి పరిస్థితుల్లోను భీమ్లా నాయక్ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారట. అందుకనే ఈ రోజు భీమ్లా నాయక్ సంక్రాంతి కానుకగా జనవరి 12న వస్తుందని మరోసారి ప్రకటించారు. దీంతో సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ మరింత రసవత్తరంగా మారింది. మరి.. భీమ్లా నాయక్ పోటీలో ఉంటుందా..? లాస్ట్ మినిట్ లో తప్పుకుంటుందో చూడాలి.
must read ;- మెగాస్టార్ మూవీలో పవర్ స్టార్.? ఇది నిజమా?
https://www.youtube.com/watch?v=rJ4BC1xsC14











