బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలిగా ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిలుపై విడుదల అయ్యారు. శుక్రవారం నాడు సికింద్రాబాదు కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఆ ఆదేశాలు అందిన తర్వాత, చంచల్ గూడ జైల్ నుండి శనివారం సాయంత్రం భూమా అఖిల ప్రియ విడుదలయ్యారు. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన నాటినుంచి, గత 18 రోజుల నుండి అఖిల ప్రియ చంచల్ గూడ జైల్లో ఉన్నారు.
అఖిల ప్రియ విడుదల తో కార్యకర్తల సంబరాలు. ఆమె విడుదల సందర్భంగా ఆళ్లగడ్డనుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. ఆళ్లగడ్డ కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. పెద్దసంఖ్యలో అభిమానులు తరలి రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: అఖిలప్రియకు బెయిల్ మంజూరు, రేపు విడుదల