అందాల అనుష్క ప్రధానపాత్రలో హారర్ థ్రిల్లర్ గా రూపొందిన సూపర్ హిట్ చిత్రం ‘భాగమతి’. జి.అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మలయాళ నటులు జయరామ్, ఉన్నిముకుందన్ నటన మరింత అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు ఇదే సినిమా బాలీవుడ్ లో ‘దుర్గామతి’ గా రీమేక్ అవుతోంది. బాలీవుడ్ లో విలక్షణ నటనకు, వైవిధ్యమైన పాత్రలకు పెట్టింది పేరైన భూమి పెడ్నేకర్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. అక్షయ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అర్షద్ వార్సీ, కరణ్ కపాడియా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై విక్రమ్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను డిసెంబర్ 11న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈనేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఒక అద్దంలో భయంకరంగా రివీలైన భూమి పెడ్నేకర్ లుక్ ఆకట్టుకుంటోంది. తెలుగు వెర్షన్ కు దర్శకత్వం వహించిన జి.అశోక్ నే హిందీ వెర్షన్ కు కూడా డైరెక్ట్ చేస్తూండడం విశేషం. నిజానికి ‘దుర్గావతి’ అనే టైటిల్ ను ముందుగా ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు దాన్ని స్వల్పంగా సవరిస్తూ.. ‘దుర్గామతి ది మిత్’ అని మార్పు చేశారు.
Must Read ;- అన్నతో కలిసి నటించాలనుకుంటున్నాడట.. !










