బిగ్ బాస్ ఫేమ్ దివి మెగాస్టార్ చిరంజీవి ‘వేదాళం’ రీమేక్ లో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ తెరకెక్కించే ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. స్వయంగా చిరంజీవే.. బిగ్ బాస్ ఫైనల్ లో స్టేజ్ పై ‘వేదాళం’ రీమేక్ లో దివి పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతే కాకుండా దివిలో గ్లామర్ యాంగిల్ ఉంది. తర్వాత ఆ యాంగిల్ ను కూడా దృష్టిలో పెట్టుకోమని డైరెక్టర్ కి చెప్పానన్నారు.
ఇదిలా ఉంటే.. దివి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కంటే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. పవర్ స్టార్ అయ్యప్పనున్ కోషియమ్ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు.
అయితే.. ఇందులో ఓ కీలక పాత్రను పోషించే లక్కీ ఛాన్స్ దివికి దక్కిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమానే ముందుగా సెట్స్ పైకి వెళ్లనుంది. సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి దివి అటు మెగాస్టార్ మూవీ, ఇటు పవర్ స్టార్ మూవీలో నటించడం అంటే బంపర్ ఆఫరే. ఈ రెండు సినిమాలతో దివి దశ తిరగడం ఖాయం.
Must Read ;- బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ఆ క్రేజీ మూవీలో నటిస్తున్నాడా?