బిగ్ బాస్ షో వలన మరచిపోయిన వాళ్లను గుర్తు చేస్తుంది. ఇక ఈ ఆర్టిస్ట్ పని అయిపోయింది అనుకున్న వాళ్లని మళ్లీ ఫామ్ లోకి తీసుకువస్తుంది. ఇక బిగ్ బాస్ 4 విషయానికి వస్తే.. అభిజిత్ కి మళ్లీ హీరోగా అవకాశాలు వస్తున్నాయి. సోహెల్ హౌస్ నుంచి ఇలా బయటకు వచ్చాడో లేదో అలా హీరోగా సినిమాని స్టార్ట్ చేసేసాడు. ఇక అవినాష్ కి నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అవినాష్, అరియానా జంటగా ఓ షో చేసే అవకాశం వచ్చిందట. ఇక మోనాల్ కి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. మోనాల్ కి ఓ స్పెషల్ సాంగ్ లో ఛాన్స్ వచ్చిందట.
ఇంతకీ ఏ సినిమాలో అంటే.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం అల్లుడు అదుర్స్. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. కరోనా కారణంగా ఆగింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జనవరి 15న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే… ఈ మూవీలో మోనాల్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సాంగ్ కేవలం మూడు నిమిషాలు మాత్రమే ఉంటుందట. ఈ మూడు నిమిషాల సాంగ్ కు ఏకంగా 15 లక్షలు డిమాండ్ చేసిందట ఈ అమ్మడు.
నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి ఓకే చెప్పారట. సాంగ్ షూటింగ్ కూడా హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యిందని టాక్. ఇక ఓంకార్ లేటెస్ట్ గా డ్యాన్స్ షో స్టార్ట్ చేసారు. ఈ షోకు మోనాల్ జడ్జ్ గా కనిపించింది. ఈ షోలో పాల్గొనేందుకు గాను ఎపిసోడ్ కి 50వేలు రూపాయలు తీసుకుంటుందట. ఇవే కాకుండా రెండు మూడు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయని తెలిసింది. మొత్తానికి బిగ్ బాస్ వలన మోనాల్ బాగానే సంపాదిస్తుంది.
Must Read ;- లవ్ స్టోరీ బయటపెట్టిన మోనాల్.. !