తెలుగు రియాల్టీ షోస్ లో ‘బిగ్ బాస్’ టాప్ లీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అత్యధికమైన టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ఇప్పటికి 4 సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 5వ సీజన్ కు టైమ్ వచ్చేసింది. యన్టీఆర్, నానీ, వరుసగా మొదటి రెండు సీజన్స్ కు హోస్టింగ్ చేయగా.. 3, 4 సీజన్స్ ను నాగార్జునే రన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ 5 వ సీజన్ కు కూడా నాగార్జునే హోస్టింగ్ చేయనుండడం విశేషంగా మారింది.
సరిగ్గా 4వ సీజన్ కు జరిగినట్టే .. 5 వ సీజన్ కూ కరోనా పాండమిక్ సిట్యువేషన్ ఎదురైంది. అందుకే జూలై నుంచి మొదలు కానున్న బిగ్ బాస్ సీజన్ 5 కోసం కాంటెస్టెంట్స్ ను ముందుగానే ఐసోలేషన్ లో ఉంచి.. నెగెటివ్ వచ్చిన వారిని హౌస్ లోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సీజన్ కోసం నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకోబోతున్నారు.
జూలై మొదటి వారంలో బిగ్ బాస్ 5 ను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. ఇక ఈ సీజన్ లోని కంటెస్టెంట్స్ పేర్లు గతంలో వినిపించాయి. మరి వారినే తీసుకుంటారో లేక ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి.. ఏకంగా షో బిగిన్ అయ్యే రోజునే అనౌన్స్ చేస్తారో అన్నది సస్పెన్స్ గా ఉంది. ఏది ఏమైనప్పటికీ లాస్ట్ సీజన్ కు మించి ఇందులో గ్లామర్ ను, అలాగే.. స్పైసీ నెస్ యాడ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అలాగే.. కొందరు యూ ట్యూబర్స్ తో పాటు ప్రముఖ నటీనటుల్ని కూడా ఈ సీజన్ కోసం ఎంపిక చేయబోతున్నారు.
Must Read ;- ‘ఫ్యామిలీ మేన్’ సెకండ్ సీజన్ కు హైలైట్ గా నిలచిన అందాల సామ్