బిగ్ బాస్ 4 విజేత ఎవరు అని ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫైనల్ కావడంతో ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా..? అని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రేక్షకులు వేసే ఓట్లు ద్వారానే ఎలిమినేషన్ ఉంటుంది. అయితే.. మోనాల్ విషయంలో మాత్రం అందరికీ డౌటే. ఇన్నాళ్లు ఎలా హౌస్ లో ఉందని. అందుకనే చాలా కొంత మంది ప్రేక్షకులు వేసే ఓట్లను బట్టి కాకుండా.. బిగ్ బాస్ స్ర్కిప్ట్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుంది అంటున్నారు. రోజురోజుకు విమర్శలు వస్తున్నాయి.

Also Read ;- లవ్ స్టోరీ బయటపెట్టిన మోనాల్.. !
మోనాల్ ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు ఓట్లు పడకపోయినా బిగ్ బాస్ సేవ్ చేసుకుంటూ వచ్చాడు అని టాక్ వినిపిస్తోంది. ఇక మోనాల్ వెళ్లిపోయింది. గ్రాండ్ ఫైనల్ దగ్గరపడుతున్న కొద్దీ విన్నర్ పై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. అయితే.. బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరు అంటే ఎక్కువ మంది చెబుతున్న పేరు అభిజిత్. సోషల్ మీడియాలో అభిజత్ కి ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతుంది. యాభై శాతంకు పైగా ఓట్లు అభిజిత్ కే వేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. అందుచేత అభిజితే విన్నర్ అని గట్టిగా వినిపిస్తుంది.
అయితే.. బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3 ఈ మూడు సీజనలలో అబ్బాయిలే విన్నర్ గా నిలిచారు. అందుచేత ఈసారి కూడా అబ్బాయే విన్నర్ గా నిలిస్తే విమర్శలు వస్తాయని ఆలోచనలో పడిందట స్టార్ మా టీవీ యాజమాన్యం. అందుకనే అరియానాని విన్నర్ గా చేయాలనుకుంటున్నారని బయట టాక్ వినిపిస్తోంది. అలాగే అభిజిత్ ని విన్నర్ గా ప్రకటించకపోతే.. ఆయన అభిమానుల నుంచి విమర్శలు వస్తాయని కూడా ఆలోచిస్తుందట. అందుచేత ఏం చేయాలి అని స్టార్ మా టీవీ ఆలోచనలో పడింది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ రెండింటి గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది అని ప్రచారం జరుగుతుంది. మరి.. ప్రచారంలో ఉన్నది వాస్తవమేనా..? కాదా అనేది పక్కనపెడితే.. విన్నర్ ఎవరు అనేది మాత్రం ఉత్కంఠ కలిగిస్తుంది. బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలియాలంటే ఈ నెల 20 వరకు ఆగాల్సిందే.
Must Read ;- బిగ్ బాస్ 4 విన్నర్ పై లీకులు నిజమౌతాయా.?











