‘బిగ్ బాస్ 4’ విన్నర్ ఎవరు అని తెలిసే రోజు దగ్గరకొస్తున్న కొద్దీ.. మరింత ఉత్కంఠ పెరుగుతుందని చెప్పచ్చు. స్టార్ మా టీవీ యాజమాన్యం గ్రాండ్ ఫైనల్ కు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫైనల్ కి చీఫ్ గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. స్టార్ మా టీవీ మాత్రం చీఫ్ గెస్ట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఫైనల్ రోజైన డిసెంబర్ 20 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఈలోపు ఎవరికి తోచినట్టుగా వాళ్లు విన్నర్ గురించి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు.
Also Read ;- బిగ్ బాస్ 4 విన్నర్ గా ఆమెను గెలిపించమంటున్న వర్మ
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అరియానాకి సపోర్ట్ చేయాలి అంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. అరియానాకి విన్నర్ అయ్యేందుకు అర్హత ఉంది. ఆమెకు సపోర్ట్ చేయాలని కోరుతూనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. వర్మ ఇలా బిగ్ బాస్ షో గురించి స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. మీరు బిగ్ బాస్ కూడా చూస్తారా అంటూ నెటిజన్లు వర్మ ట్వీట్ పై కామెంట్ చేసారు. ఇక వర్మతో పాటు హీరో శ్రీకాంత్ కూడా బిగ్ బాస్ గురించి స్పందించడం విశేషం. ఇంతకీ శ్రీకాంత్ ఏమన్నారంటే.. బిగ్ బాస్ షో అంటే చాలా ఇష్టం. ఒక్క తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో బిగ్ బాస్ కూడా చూస్తుంటాను.
మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు ఈ షో ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. ఇక ఈ సీజన్ విన్నర్ గురించి చెబుతూ.. అభిజిత్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నారు. సోహెల్, అరియానాలు కూడా బాగా కష్టపడుతున్నారని, అయితే.. తన ఫేవరేట్ కంటెస్టెంట్ మాత్రం అభిజిత్ అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు హీరో శ్రీకాంత్. ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ, హీరో శ్రీకాంత్ బిగ్ బాస్ విన్నర్ గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. మరి.. ఈ ఇద్దరిలో ఎవరు చెప్పింది నిజం అవుతుందో తెలియాలంటే ఈ నెల 20 వరకు ఆగాల్సిందే.
Must Read ;- ‘బిగ్ బాస్ 4’ ఫైనల్ ఎపిసోడ్ అతిధి రాకపై వీడని సస్పెన్స్