దివి నుంచి భువికి వచ్చిన సౌందర్యమా? అందాల ఆరబోతకు ఈ సుందరాంగి ఏమీ వెనకాడటం లేదు. ఈ మధ్య విడుదల చేసిన ఫొటోలతో అందరి దృష్టినీ ఆకర్షించే ప్రయత్నం చేసింది దివి వధ్య.
ఇటీవల బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన దివికి మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. అందుకే నేనేం తక్కువ అనుకుందేమో అంగాంగ ప్రదర్శనతో కూడిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఏకంగా ఎదపై టాటూ వేయించుకుని దాన్ని చూపిస్తూ వామ్మో అనిపించింది ఈ ముద్దుగుమ్మ. అసలు నిక్కర్ కూడా లేకుండా షర్ట్ బట్టన్లు విప్పేసి అందాలను ప్రదర్శిస్తూ ఫోటో షూట్ చేసి అందరికీ షాక్ ఇచ్చేసింది. ఈ ఫొటోలతో మళ్లీ అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది.
టీవీ 2020 లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ విజేతగా దివి వధ్య తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనేక అవకాశాలు కూడా ఆమెను వరించాయి. బిగ్ బాస్ సీజన్4లో అవకాశం రావడంతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. మంచి ఎత్తు, అంతకుమించిన ఎత్తులు, చొట్ట బుగ్గలు, నాజూకైన రూపురేఖలు చూసి జనం ఫిదా అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు వివాదాలకు దూరంగా ఉంది. ఎందుకో తెలియదుగానీ డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ తో సన్నిహితంగా మెలిగింది. చాలా వారాలు కొనసాగినా నిష్క్రమించక తప్పలేదు. ఆమెలో సినిమాల యావ తగ్గలేదు.
మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాలో నటించినా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. మరికొన్ని అవకాశాలు వచ్చినా కాలం కలిసిరాలేదు. ఒక్క బిగ్ బాస్ మాత్రమే ఆమెకు సరైన గుర్తింపు తెచ్చింది. బిగ్ బాస్ పుణ్యమా అని ఆమెకు సినిమా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వెబ్ సిరీస్ లతో పాటు చిన్న సినిమాలకు దివి బెస్ట్ ఛాయిస్ అనే మాట కూడా వినిపిస్తోంది. హీరోయిన్ అవ్వాలన్నది ఆమె కోరిక.
ఇటీవల క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో ఆమెప్రధాన పాత్ర పోషించింది. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో కూడా గ్లామర్ పాత్రే. ఆమె లుక్స్ పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఈ క్యాబ్ స్టోరీస్ రామ్ గోపాల్ వర్మ సొంత ఓటీటీ స్పార్క్ లో విడుదలై మంచి హిట్ అయ్యింది. లంబసింగి అనే సినిమాలోనూ నటిస్తోంది. మెగాస్టార్ సినిమాలోనూ ఆఫర్ వచ్చింది. అన్నీ చూస్తుంటే ఈ దివికి హాట్ అవకాశాలన్నీ వరించేలా ఉన్నాయి.
Must Read ;- కజిన్ ఆఫ్ అనన్యా పాండే .. ఏంజిల్ ఆఫ్ హాట్ నెస్