గడిచిన రెండు సీజన్లుగా బిగ్ బాస్ లో సరైన కంటెస్టెంట్లు పడలేదు. తప్పనిసరి పరిస్థితుల మధ్య వాళ్లను, వీళ్లను తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే 10శాతం మాత్రమే సెలబ్రిటీలు కనిపిస్తే, మిగతా 90శాతం సోషల్ మీడియా సెలబ్రిటీలు మాత్రమే. కానీ ఈసారి పరిస్థితి మారబోతున్నట్టు కనిపిస్తోంది. చాలామందికి తెలిసిన ముఖాలు ఈసారి సీజన్-5లో కనిపించబోతున్నాయని టాక్.
ఎప్పట్లానే సీజన్-5 కూడా నాగార్జున వ్యాఖ్యానంతోనే సాగబోతోంది. సెప్టెంబర్ 5 నుంచి సీజన్-5 స్టార్ట్ అవుతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ టీజర్ త్వరలోనే స్టార్ మాలో ప్రత్యక్షం కాబోతోంది. కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జూమ్ యాప్ లాంటి టెక్నాలజీని వాడుకోవాలని అనుకుంటున్నారు.
ఇక కంటెస్టెంట్ల విషయానికొస్తే.. ఈసారి బిగ్ బాస్ హౌజ్ లోకి హైపర్ ఆది, వర్షిణి, కమెడియన్ ప్రవీణ్, శేఖర్ మాస్టర్ సింగర్ మంగ్లీ లాంటి సెలబ్రిటీలు అడుగుపెడతారనే టాక్ గట్టిగా నడుస్తోంది. వీళ్లకు తోడుగా మీడియా నుంచి యాంకర్ ప్రత్యూష హౌజ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంతకుముందు సీజన్ లో టీవీ9 నుంచి దేవి అడుగుపెట్టగా.. ఈసారి ప్రత్యూషకు ఆ అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.
ఇక యూట్యూబ్ లో బాగా పాపులర్ అయిన యాంకర్ శివ కూడా హౌజ్ లో అడుగుపెట్టే అవకాశం ఉంది.రీసెంట్ గా టెలికాస్ట్ అయిన జబర్దస్త్ లో యాంకర్ అనసూయను స్టేజ్ పైనే సూటిగా ప్రశ్నించింది ఇతడే. శివ మాటలతో అనసూయ హర్ట్ అయిన సంగతి తెలిసిందే.
వీళ్లతో పాటు ఫన్ బకెట్ భార్గవ, సీనియర్ నటి ప్రియ, మరో సీనియర్ నటి యమున, సురేఖవాణి, వరంగల్ వందన, ఫన్ బకెట్ భార్గవ్ లాంటి వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా ఈసారి సీజన్-5 కోసం చాలామంది తెలిసిన ముఖాల పేర్లు వినిపించడంతో బిగ్ బాస్-5 ఆసక్తికరంగా మారింది. అయితే వీళ్లలో ఎంతమంది హౌజ్ లో అడుగుపెడతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఎందుకంటే, బిగ్ బాస్ కు సంబంధించి కొత్త సీజన్ ఎప్పుడు ప్రకటించినా, ఇలా ముందుగా ప్రముఖుల పేర్లు వినిపిస్తుంటాయి. ఆ తర్వాత వాళ్లంతా తప్పుకున్నట్టు ఖండన ప్రకటనలు వస్తాయి. ఆ తర్వాత అంతగా క్రేజ్ లేని ముఖాలు హౌజ్ లోకి అడుగుపెడుతుంటాయి. ఈసారి అలా జరగకూడదని బిగ్ బాస్ అభిమానులు కోరుకుంటున్నారు.
అయితే హైపర్ ఆది, శేఖర్ మాస్టర్, యాంకర్ వర్షిణి లాంటి బిజీ ఆర్టిస్టులు తమ కెరీర్ ను పక్కనపెట్టి.. వంద రోజుల పాటు హౌజ్ లో గడపడానికి ఒప్పుకుంటారా అనేది పెద్ద ప్రశ్న. వీళ్లంతా అటు సినిమాలు, ఇటు టీవీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి వీళ్ల ఎఁట్రీని అప్పుడే నిర్థారించలేం. అయితే యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, టిక్ టాక్ స్టార్ దుర్గారావు మాత్రం ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు.
Must Read ;- బిగ్ బాస్ 5 కంటెస్టంట్స్ లిస్ట్ ఇదే.